JNTU-H introduces BTech Minor degree programmes బి-టెక్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన జేఎన్టీయూహెచ్..

No matter what course you take at btech you can now get the software

jawaharlal nehru technological university-hyderabad, JNTUH, JNTUH Registrar, Professor Manzoor Hussain, B.Tech Honours, BTech Minor degree, BTech stream, CSE combined with AI, Mission Learning, Data Science, Cyber ​​Security, IoT, telangana

JNTUH (JTU) has created an opportunity for students who are unfamiliar with the B.Tech Computer Science subject or cannot get a seat in it .. Students enrolled in Engineering course like Civil, Mechanical, Electrical, Electronics with dissatisfaction can now get CSE type software jobs. The new education system has been implemented from the 2021-22 academic year.

బి-టెక్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన జేఎన్టీయూహెచ్..

Posted: 10/13/2021 09:42 PM IST
No matter what course you take at btech you can now get the software

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో ప్రవేశం పొందలేక, లేదా అందులో సీటు రాక.. అసంతృప్తితోనే సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇక నుంచి సీఎస్‌ఈ మాదిరి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొందే విధంగా జేఎన్టీయూహెచ్‌ గోల్డెన్‌ అవకాశాన్ని కల్పించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచే కొత్త విద్యావిధానానికి శ్రీకారం చుట్టింది. దీని వల్ల సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతున్న ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు కూడా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సు ఆశయాలు నెరవేర్చుకోబోతున్నారు.

కంప్యూటర్‌ సైన్స్‌ కాకుండా.. ఇతర గ్రూపులతో ఇంజినీరింగ్‌ చదువుతున్న థర్డ్‌ ఇయర్‌, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు సీఎస్‌ఈ అనుబంధ కొత్త కోర్సులు ఏఐ, మిషన్‌ లెర్నింగ్‌, డాటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ వంటి కోర్సులు చదువుకునే అవకాశాన్ని కల్పించాలని జేఎన్టీయూహెచ్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కోర్సులు దిగ్విజయంగా పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్‌ డిగ్రీతో పాటు అదనంగా మైనర్‌ డిగ్రీ ఇవ్వనున్నారు. ఈ మేరకు తాను ఏ కోర్సు పూర్తి చేశారో ఆ కోర్సును తెలియచేస్తూ సర్టిఫికెట్‌లో లిఖిత పూర్వకంగా ఇస్తామని జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌హుస్సేన్‌ స్పష్టం చేశారు.

బీటెక్‌తో పాటు మైనర్‌ డిగ్రీలు పూర్తి చేసిన వారికి కూడా భవిష్యత్‌లో సీఎస్‌ఈ విద్యార్థులతో సమానంగా ఐటీ ఉద్యోగాలు చేసుకునే సామర్థ్యం వస్తుందన్నారు. ఇలాంటి సరికొత్త విద్యా విధానం కోసం జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు దాదాపు రెండు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం గురించి జేఎన్టీయూహెచ్‌ కు అనుబంధంగా ఉండే ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలకు సమాచారం అందచేశారు. ప్రస్తుతం జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో దాదాపు 50 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలలో సీఎస్‌ఈ అనుబంధ కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురావడంతో జేఎన్టీయూహెచ్‌  అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడానికి తేలికైంది.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ఐదు కొత్త కోర్సులదే ట్రెండింగ్‌ అని, ఆ కోర్సులు పూర్తి చేసిన యువతకు వచ్చే పదేండ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఎలాంటి ఢోకా ఉండబోదని యూనివర్సిటీల ప్రొఫెసర్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ వంటి ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతున్న ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు ఆయా కోర్సులలో తప్పనిసరిగా 20 క్రెడిట్‌ పాయింట్లు సాధించాలి. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి ఏడాది దాదాపు 25 నుంచి 30 శాతం విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ కోర్సులు బోధించడానికి ఇప్పటికే ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. ఈ మేరకు టీచింగ్‌ ఫ్యాకల్టీ కూడా సిద్ధంగా ఉంది.

సీఎస్‌ఈ అనుబంధ కోర్సులను బీటెక్‌ స్పెషలైజేషన్‌గా ఎంపిక చేసుకున్న సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సిలబస్‌ విషయంలో ఎలాంటి భయాలు లేవు. ఈ కోర్సులు చదువుకోవడానికి క్లాస్‌రూమ్‌ బోధనతో పాటు ఆన్‌లైన్‌ బోధనను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందుకోసం విద్యార్థులు తమ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే జేఎన్టీయూహెచ్‌ రూపొందించిన సిలబస్‌ ప్రకారం ప్రిపేర్‌ కావాలి, పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. ఇప్పటికే యూజీసీ వారు అందించే మూక్స్‌ వంటి ఆన్‌లైన్‌ బోధన వేదికల ద్వారా కూడా ప్రిపేర్‌ కావడానికి అవకాశం కల్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles