Prakash Raj’s panel winners resigned MAA posts ‘మా’ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాం.. రాం..

Maa elections all winners from prakash raj s panel resigned

Prakash Raj ready to act with Manchu Vishnu, Prakash Raj loses, Prakash resigns from MAA membership, Prakash Raj loses in MAA Elections, maa elections 2021, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, jeevitha, prakash raj, manchu vishnu, hema actress, maa news, maa president, maa association president, prakash raj news, tollywood, movies, entertainment

Actor Prakash Raj has reportedly announced that all the winners from his panel are resigning from the ‘MAA’- Movie artist association of Telugu Cinema and said that they’re resigning to avoid any setbacks and assurances given by Manchu Vishnu in the recent elections.

‘మా’ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల మూకుమ్మడి రాజీనామా

Posted: 10/12/2021 08:28 PM IST
Maa elections all winners from prakash raj s panel resigned

ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలు అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయిన నటుడు ప్రకాష్ రాజ్.. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11మంది వారి పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నో కలలు, ఆశలతో మాలో పోటీ చేశామని, అయితే, ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగింది. క్రమశిక్షణ కలిగిన బెనర్జీపై మోహన్ బాబు చేయి చేసుకున్నారని అన్నారు.

ముందు రోజు 11మంది ఈసీ సభ్యులు గెలిచారని అన్నారని, సడెన్‌గా లెక్కలు ఎలా మారిపోయాయని ప్రశ్నించారు. మీరు, మేమూ అనుకుంటే సరిగ్గా పనిచేయలేమని, ఎన్నికలు జరిగిన తీరు సరిగ్గా లేదన్నారు ప్రకాష్ రాజ్. ఎన్నికల్లో గెలిచిన సభ్యులు కూడా వారితో పనిచేయలేమని అంటున్నారు. అందుకే గెలిచిన పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నిర్ణయించుకుంది. అయితే ‘మా’ సభ్యత్వం రాజీనామా విషయంలో మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు చెప్పారు ప్రకాష్ రాజ్.

ఈ మేరకు తన ప్యానెల్ నుంచి మా కమిటీకి ఎన్నికైన 11 మంది సభ్యులు పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు కూడా పేర్కోన్నారు. ఈ మేరకు ఓ లేఖను కూడా రాశారు. అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై వుందని.. అందువల్ల భవిష్యత్తులో “మా” లో ఏ అభివృద్ధి జరక్కపోయినా, సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా ప్రశ్నించేందుకు తాము సిద్దంగా వుంటామని ప్రకాశ్ రాజ్ పేర్కోన్నారు. ఇక తాము మా కు పోటీగా ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ అంటూ ఏవో సంఘాలు పెడుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'మా' ఎన్నికల్లో నరేశ్ అద్భుతంగా వ్యవహరించారని, పరిస్థితులు చూస్తుంటే ఇకపై 'మా' కొత్త కార్యవర్గాన్ని ఆయనే వెనకుండి నడిపిస్తారని అర్థమవుతోందని అన్నారు. గతంలో 'మా' అధ్యక్షుడిగా పనిచేసిన నరేశ్ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా 'మా'లో ఆయన హవానే నడుస్తుందన్న అనుమానం కలిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్యానెల్ సభ్యులు 'మా'లో కొనసాగితే రచ్చ తప్పదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.

ఉపాధ్యక్షుడిగా గెలిచిన బెనర్జీ మాట్లాడుతూ.. పోలింగ్ రోజున బూత్ వద్ద దూరంగా నిలబడి ఉండగా.. తనీశ్ ను మోహన్ బాబు తిట్టడం చూసి.. అక్కడికి వెళ్లి గొడవలు వద్దని చెప్పాను. దాంతో మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. అరగంటసేపు నన్ను పచ్చిబూతులు తిట్టారు. కొట్టబోయారు కూడా. అలా ఆయన తిడుతూ ఉంటే విష్ణు, మనోజ్ వచ్చి సారీ అంకుల్... ఆయనను మళ్లీ ఏమీ అనవద్దు అని రిక్వెస్ట్ చేశారు. ఆయన డీఆర్సీ సభ్యుడిగా వుంటూ ఆయనే ఇలా ప్రవర్తిస్తారా.? అని ప్రశ్నించారు. పాపం తనీశ్ ఏడుస్తూ ఉండిపోయాడు. అందుకే మా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని వివరించారు.

భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా తాము తప్పుకుంటున్నామని నటుడు ఉత్తేజ్‌ అన్నారు. పోలింగ్‌ రోజున నరేష్‌ యుద్ధవాతావరణం సృష్టించారని, తనని తన కుటుంబ సభ్యులను బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. 'నా  భార్య పద్మ చనిపోతే చిరంజీవి, జీవితా రాజశేఖర్‌, ప్రకాశ్‌రాజ్‌ సహా పలువురు హస్పిటల్‌ వద్దనే ఉండి తన ఓదార్చారు. కానీ నరేష్‌ నుంచి మాత్రం​ ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా రాలేదు. తన 25 ఏళ్ల కెరీర్‌లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. నరేష్ వల్లే "మా" శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది. విష్ణు బాగా పనిచేయాలని ఆశిస్తున్నాం' అని ఉత్తేజ్‌ పేర్కొన్నారు.

ఈసీ మెంబర్ గా గెలిచిన యువనటుడు తనీశ్ మాట్లాడుతూ, తీవ్ర బావోద్వేగానికి లోనయ్యారు. పోలింగ్ సందర్భంగా మోహన్ బాబు తనను దారుణంగా తిట్టారని ఆరోపించారు. తనకు తల్లే అన్నీ అని, అలాంటి అమ్మను కించపరిచేలా మోహన్ బాబు తిట్టారని వెల్లడించారు. ఆ సమయంలో ఎంతో బాధేసిందని.. దానిని అపేందుకు వచ్చిన బెనర్జీని కూడా మోహన్ బాబు భయంకరంగా తిట్టారని తెలిపారు. ఏ రోజూ తాను మీడియా ముందుకు రాలేదని, వివాదాలకు దూరంగా ఉంటానని చెప్పుకోచ్చారు. తాను కూడా ఈసీ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నానని, తనకు ఓటేసిన వారందరికీ తనీశ్ క్షమాపణలు చెప్పారు.

ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌ నుంచి బెనర్జీ (ఉపాధ్యక్షుడు), శ్రీకాంత్‌(ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), ఉత్తేజ్‌(జాయింట్‌ సెక్రటరీ)
ఈసీ మెంబర్లు: శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్‌, తనీష్‌, సురేశ్‌ కొండేటి, సమీర్‌, సుడిగాలి సుధీర్‌, కౌశిక్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles