No capacity restriction for domestic flights దేశీయ విమాన సంస్థలకు కేంద్రం తీపికబురు..

Centre allows domestic airlines to fly with 100 capacity from october 18

India flights, Domestic flights, Indigo, spicejet, India flights details, airlines covid capacity, Domestic flight operations, airlines coronavirus

Domestic airlines will now be able to operate at 100% of their pre-Covid capacity from 18th October, according to a govt statement issued on Tuesday. The Ministry of Civil Aviation had capped domestic airline capacity since May 2020. Currently, the cap on the capacity for domestic flights was at 85%.

దేశీయ విమాన సంస్థలకు కేంద్రం తీపికబురు.. ఇక నూరుశాతం సీటింగ్

Posted: 10/12/2021 09:40 PM IST
Centre allows domestic airlines to fly with 100 capacity from october 18

దేశీయ విమానాయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీపి కబురు చెప్పింది. ఎంతలా అంటే దాదాపుగా రెండేళ్ల తరువాత మళ్లీ విమానాల్లో పూర్తిగా ప్రయాణికుల కళకళలు కనబడేలాంటి నిర్ణయాన్ని వెలువరించింది. పండగ సీజన్ లో అందరూ సంబరాల్లో మునిగగా, విమానయాన సంస్థలకు కూడా తీపికబురతో కేంద్రం ఉత్తేజపర్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ విమానాల్లో ప్రయాణికుల సీటింగ్‌ కెపాసిటీపై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా ఈ ఆంక్షల ఎత్తివేత అమలు ఈ నెల 18 నుంచి ఆచరణలోకి వస్తుందని పేర్కొంది. ఇకపై విమానాలను వందశాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని పేర్కొంది. వచ్చే సోమవారం నుంచి వందశాతం సామర్థ్యం విమానయాన సంస్థలు సర్వీసులను నడుపుకోవచ్చని పేర్కొన్న మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం లాక్‌డౌన్‌ సమయంలో దేశీయ విమానాలను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ అనంతరం మే 25న కొవిడ్‌ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్‌ కెపాసిటీతో విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది.

గతేడాది డిసెంబర్‌ వరకు క్రమంగా 80 శాతానికి పెంచగా.. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ ఒకటిన ఆక్యుపెన్సీని 50శాతానికి తగ్గించింది. ఆగస్ట్‌ 12 నాటికి 72.5శాతానికి సీటింగ్‌ కెపాసిటీని పెంచింది.. సెప్టెంబర్‌లో 85శాతానికి పెంచగా.. తాజాగా పూర్తిస్థాయిలో నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కొవిడ్‌ వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్ట్‌ ఆపరేట్లను మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles