Tamil Nadu district makes Covid vaccination mandatory ఈ జిల్లాలో ‘‘నో వాక్సీనేషన్.. నో లిక్కర్’’ ఆంక్షల అమలు

Tamil nadu district collectot impliments new condition for sale of alcohol

No Vaccination no Liqour, vaccination, J Innocent Divya, District Collector, Nilgiris, alocohol, Tamil Nadu, Covid vaccination, ICMR Director General, Dr Balram Bhargava

Tamil Nadu's Nilgiris district has made vaccination mandatory for those who want to buy liquor. Announcing this move, the district collector said that some people could not take vaccine as they had consumed alcohol, now they will have to first get vaccinated if they want to buy liquor.

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో మందుబాబులకు షాక్.!

Posted: 09/09/2021 02:08 PM IST
Tamil nadu district collectot impliments new condition for sale of alcohol

యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. తన రూపాన్ని మార్చుకుంటూ అల్పా, బీటా, డెల్టా, సీ.1.2 సహా పలు వేరియంట్ల రూపంలో ప్రజలను ప్రభావితుల్ని చేసి దేశాలకు దేశాలనే గడగడలాడిస్తోంది. ఇక మన దేశంలో అటు కేరళ, ఇటు మహారాష్ట్రలలో కరోనా కేసులు విజృంభన ఇంకా కొనసాగుతూనే వుంది. అయితే కొంతకాలం క్రితం వరకు తమిళనాడులోనూ అత్యంత ప్రభావాన్ని చూపిన కరోనా గతకొద్ది కాలంగా తగ్గుముఖం పట్టింది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే త‌మిళ‌నాడులో కూడా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతున్న‌ది. ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారులు జెట్ స్పీడ్‌తో వ్యాక్సినేష‌న్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు.

అయితే దేశంలోనే తమ జిల్లా పూర్తి శాతం వాక్సీనేషన్ పొందిన తమిళనాడుకు చెందిన నీలగిరి జిల్లాగా మర్చేందుకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. వీటి ఫలితంగా ఏకంగా 97 శాతం మంది వాక్సీన్ తీసుకున్నారు. జిల్లాలో డ‌బుల్ డోస్ తీసుకున్నవారు, సింగిల్ డోస్ తీసుకున్న‌వారు క‌లిపి మొత్తం 97 శాతానికి చేరారు. అయితే దాన్ని 100 శాతానికి పెంచ‌డం మాత్రం అధికారుల‌కు క‌ష్ట‌సాధ్యంగా మారింది. ఎవరు వాక్సీన్ తీసుకోలేదన్న విషయాన్ని కూడా కనుక్కోవడం కూడా అధికారులకు కష్టంగా మారింది. దీంతో వారిని గుర్తించి వాక్సీనేషన్ ఇచ్చేందుకు అధికారులు నయా అంక్షలను అమలు చేస్తున్నారు. కేవలం మ‌ద్యం ప్రియులు మాత్రమే మత్తులో వుండి వాక్సీన్ తీసుకోకపోవచ్చునని గ్రహించిన అధికారులు.. వారిని గుర్తించే చర్యలకు పూనుకున్నారు.

అదెలా అంటే.. రెండు డోసుల కొవిడ్ టీకాలు వేసుకున్న వారికి మాత్ర‌మే మ‌ద్యం విక్ర‌యించాలంటూ జిల్లాలోని వైన్స్‌లు, బార్ల య‌జ‌మానుల‌కు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌న్నారు. ఈ అదేశాలను నీల‌గిరి జిల్లా క‌లెక్ట‌ర్ జే ఇన్నోసెంట్ దివ్య జారీ చేసి అమల్లోకి తీసుకువచ్చారు, దీంతో మ‌ద్యం కొనుగోలు చేసేందుకు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ల‌ను కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లుగా ప్రూఫ్ చూపంచ‌మ‌ని అడ‌గాల‌ని, ప్రూఫ్ చూపించిన వారికి మాత్ర‌మే మ‌ద్యం విక్ర‌యించాల‌ని క‌లెక్ట‌ర్ దివ్య త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు. తాజా నిబంధ‌న‌తో 100 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌న్న త‌మ ల‌క్ష్యం నెరువేతుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles