Taliban raided closed Indian consulates భారత రాయభార కార్యాలయాల్లో తాలిబన్ల తనిఖీలు..

Taliban searched closed indian consulate in kandahar govt sources

Taliban, Indian consulates, Afghanistan Crisis, Kandahar, Herat, afghan spies, afghanistan crisis, indians in afghanistan, Afghanistan, Afghanistan latest news, Taliban, Taliban latest news, Kabul, Kabul Airport, hindus in afghanistan, hindu temple in afghanistan, taliban, kabul, Devotional

The Taliban visited closed Indian consulates in Afghanistan, searched for documents and took away parked cars, government sources said today, expressing worry that it meant the group is acting against the assurances its leaders have been giving to the world.

అప్ఘనిస్తాన్ లోని భారత రాయభార కార్యాలయాల్లో తాలిబన్ల తనిఖీలు..

Posted: 08/20/2021 01:36 PM IST
Taliban searched closed indian consulate in kandahar govt sources

ఆఫ్ఘ‌నిస్తాన్ లోని 32 ప్రావిన్సులను తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ఇక వెనువెంటనే రంగంలోకి దిగి ప్రతీ ఇంటిని తనిఖీ చేస్తున్నారు. గ‌తంలో నాటో ద‌ళాల‌కు ప‌నిచేసిన వారి కోసం గాలింపు చేప‌డుతున్నారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌ను తాలిబ‌న్లు బెరిస్తున్న‌ట్లు యూఎన్ చెప్పింది. ఎటువంటి ప్ర‌తీకారం తీర్చుకోమ‌ని తాలిబ‌న్లు చెప్పినా.. ప్ర‌స్తుతం ఆ మిలిటెంట్లు మాన‌వ‌వేట కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వ్య‌క్తిగ‌తంగా కొంద‌ర్ని తాలిబ‌న్లు టార్గెట్ చేస్తున్నార‌ని, ఆ బెదిరింపులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని రిప్టో నార్వేయ‌న్ సెంట‌ర్ త‌న నివేదిక‌లో తెలిపింది.

ఇదలావుండగా అప్ఘనిస్తాన్ లోని తీవ్ర సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలోని కందహార్ సహా హెరత్ లలో వున్న భారత రాయబార కార్యాలయాలు మూసివేశారు. అయితే ఇంటింటా తనీఖీలు చేస్తున్న తాలిబన్లు మూసివున్న భార‌త కాన్సులేట్ల‌ను ముట్టడించారు. తలుపులు బద్దలు కోట్టి మరీ ఆ కార్యాలయాల్లో త‌నిఖీలు చేశారు. కార్యాల‌యాల్లో ఉన్న పేప‌ర్ల‌ను, పార్క్ చేసిన కార్ల‌ను తీసుకువెళ్లిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రెండు కాన్సులేట్ల‌లో ఉన్న అన్ని వ‌స్తువుల్ని వాళ్లు ప‌రిశీలించారు. గ‌త ఆదివారం కాబూల్‌ను చేజిక్కించుకున్న తాలిబ‌న్లు.. ఆ న‌గ‌రంలో డోర్ టు డోర్ త‌నిఖీ చేప‌డుతున్నారు.

జాతీయ భ‌ద్ర‌త విభాగం కోసం ప‌నిచేసిన వారి స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భార‌త్‌కు చెందిన నాలుగు దౌత్య కార్యాల‌యాలు ఉన్నాయి. కాబూల్‌లో అద‌నంగా మ‌రో ఎంబ‌సీ ఉన్న‌ది. కాంద‌హార్‌, హీర‌త్‌తో పాటు మ‌జార్ యే ష‌రీఫ్ ప‌ట్ట‌ణంలోనూ భార‌తీయ కాన్సులేట్ ఉంది. అయితే తాలిబ‌న్ మిలిటెంట్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి కొన్ని రోజుల ముందే మ‌జార్ యే ష‌రీఫ్ కాన్సులేట్‌ను మూసివేశారు. మూడు రోజుల్లోనే ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి సుమారు 200 మంది దౌత్య సిబ్బందిని త‌ర‌లించిన‌ట్లు రాయ‌బారి రుద్రేంద్ర టండ‌న్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles