CJI on media reports about SC judges appointments సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల వార్తలపై సీజేఐ అసహనం

Extremely upset with media reports speculating collegium recommendations cji ramana

Chief Justice of India CJI, NV Ramana, media speculation, collegium recommendations, supreme court, CJI, NV Ramana, SC collegium, Supreme Court, Judges appointment

The Chief Justice of India NV Ramana said that he was "extremely upset" with the media speculation about the recommendations made by the Supreme Court collegium. Highlighting that the process of appointment of judges is "sacrosanct" and "has certain dignity attached to it", the CJI said, "reflections in some sections of the media, pending the process, even before formalising the resolution is counter productive".

సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల వార్తలపై సీజేఐ అసహనం

Posted: 08/18/2021 04:45 PM IST
Extremely upset with media reports speculating collegium recommendations cji ramana

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలకు సంబంధించి కొలీజియం సిఫార్సులపై మీడియాలో కథనాలు వెలువడుతున్న తరుణంలో దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తుల ఎంపిక నేపథ్యాన్ని కొలీజియం పర్యవేక్షిస్తుందని అన్నారు. ఇంకా ఎలాంటి ఇలాంటి వార్తలను రాసేటప్పుడు మీడియా కొంచెం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. దేశ న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశంలో ఎంతో గణనీయమైన ప్రకియతో న్యాయమూర్తులు ఎంపిక జరుగుతుందని అన్నారు.

అయితే ఇంకా కొలీజియం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడకముందే ఎవరు తదుపరి దేశ ప్రధాన న్యాయమూర్తి అవుతారన్న అంశంతో పాటు పలు రకాల కథనాలను ఇలా వార్తలు రాయడం వల్ల చెడు జరిగే ప్రమాదం ఉందన్నారు. ‘‘జడ్జిల నియామక ప్రక్రియ అంటే ఎంతో పవిత్రమైనది. దానికంటూ ఓ గొప్పతనం ఉంది. కాబట్టి మీడియా మిత్రులంతా ఆ ప్రక్రియ పవిత్రతను కాపాడాలని కోరుతున్నా’’ అని ఆయన అన్నారు. జస్టిస్ నవీన్ సిన్హా వీడ్కోలు సభ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గొప్ప స్థాయికి ఎదగాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారని,

అయితే, ఇలాంటి బాధ్యతారహితమైన వార్తల వల్ల అలాంటి వారి కెరీర్ నష్టపోయిన దాఖలాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి వార్తలు రాయడం దురదృష్టకరం అని అన్నారు. ఇంతటి సీరియస్ వ్యవహారాన్ని ప్రసారం చేయని సీనియర్ జర్నలిస్టులు, మీడియా సంస్థలను అభినందిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం జడ్జిల నియామక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే దానిపై సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలుగా తొమ్మిది మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసిందని, అందులో ముగ్గురు మహిళా జడ్జిలున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles