IAS Topper Couple Tina Dabi And Athar Aamir Khan Divorced ఐఏఎస్ టాపర్ జంటకు అమీర్ ఖాన్, టీనా దాబిలకు విడాకులు..

Ias topper couple tina dabi and athar aamir khan officially divorced in jaipur

Tina Dabi, Athar Khan, IAS toppers, inter religion marriage, Love Jihad, Divorce, Tina Dabi Athar Khan divorce, jaipur, Rajasthan cadre IAS couple, Tina Dabi divorce news, Athar Khan divorce news, Latest Telugu News

Tina Dabi and Athar Aamir Khan, the Indian Administrative Service (IAS) officers whose wedding in 2018 made headlines and was attended by top politicians, are now divorced. A family court in Jaipur has granted their request for divorce.

ఐఏఎస్ టాపర్ జంటకు అమీర్ ఖాన్, టీనా దాబిలకు విడాకులు..

Posted: 08/11/2021 05:44 PM IST
Ias topper couple tina dabi and athar aamir khan officially divorced in jaipur

టీనా దాబి, అథర్ ఆమిర్ ఖాన్.. గుర్తున్నారా.. వీరిద్దరూ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారులు. అందులో విశేషమేముంది అంటారా.? 2015లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్షలో వీరిద్దరూ టాపర్లుగా నిలిచారు. టీనా టాపర్ అయితే.. అథర్ సెకండ్ ర్యాంకర్. అక్కడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది.. స్నేహం కుదిరింది.. ద్దరి మనసులు కలిశాయి.. అది కాస్తా ప్రణయానికి దారితీసింది. దేశం గర్వించదగ్గ మతాంతర వివాహానికి వారిద్దరూ అడుగులు వేశారు. వారి కుటుంబాలు కూడా అంగీకరించాయి. మతాలు వేరైతేనేం.. అభిమతాలు ఒక్కటని చాటారు. 2018లో పరిణయంతో ఒక్కటయ్యారు.

ఏమైందో ఏమోగానీ.. రెండేళ్లకే జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. అభిమతాలు ఒక్కటని కలసిన జంట.. దేశంలోని దాదాపు 99శాతం మంది భార్యభర్తల్లో కొందరు సర్దుకుపోతుండగా, మిగతావారు ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఈఐఏెఎస్ టాపర్ జంట మాత్రం వీరిందరికీ విరుద్దంగా ఎలా విడిపోతున్నారు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. భార్యభర్తల బంధాన్నే సరిగ్గా నిర్వర్తించలేని వీరు ఇక ఐఏఎస్ విధులను ఎలా సక్రమంగా నిర్వహిస్తారన్న ప్రశ్నలు కూడా దేశ ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నాయి, వీరు పెట్టుకున్న విడాకుల పిటీషన్ ను తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్ కోర్టు మంజూరు చేసింది.

2018లో అతిరథమహారథులు హాజరుకాగా అంగరంగవైభవంగా జరిగిన వీరి కళ్యాణం రెండేళ్ల వ్యవధిలోనే పెటాకులైంది. అయితే వీరిద్దరి వివాహం దేశంలోని సామరస్యతకు నిదర్శమని చెప్పుకోగా మురిసిన వధూవరులు.. ఇవాళ విడాకులు మంజూరు కావడంతో ముభావంగా మారారు. 2020 నవంబర్ లో పరస్పర అంగీకారంతో వారిరువురూ విడాకులకు దరఖాస్తు చేశారని వారి కుటుంబాలు చెబుతున్నాయి. రాజస్థాన్ కేడర్ కు చెందిన వారిద్దరూ ఇన్నాళ్లూ అక్కడే విధులు నిర్వర్తించారు. విడాకుల నేపథ్యంలో కశ్మీర్ కు చెందిన అథర్ ను అక్కడికే డిప్యూటేషన్ పై పంపించారు. ప్రస్తుతం శ్రీనగర్ లో డ్యూటీ చేస్తున్నారు.

శ్రీరామ్ లేడీ కాలేజీలో డిగ్రీ చేసిన టీనా దాబి.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ను సాధించిన తొలి దళిత మహిళగా రికార్డు సృష్టించారు. శిక్షణ సమయంలో అథర్ ఖాన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి 2018 ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. ఆ వేడుకకు ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే, వారిద్దరి పెళ్లిపై నాడు వివాదం చెలరేగింది. ‘లవ్ జిహాద్’ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, వాటిని తాను పట్టించుకోనని, తమది మతాలకు అతీతమైన పెళ్లి అని ఆనాడు టీనా చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles