Police file FIR against Lucknow Girl after outrage క్యాబ్ డ్రైవర్ ను కోట్టిన యువతిపై పోలీసుల ఎప్ఐఆర్

Fir registered against lucknow girl who thrashed cab driver in viral video

gril assaults cab driver, girl assaults mediator, girl assaults cab driver on road, uttar pradesh girl assaults cab driver, cab driver assaulted awadh cross road, lucknow, Awadh crossroads, #ArrestLucknowGirl, lucknowgirl, viral, social media, twitter, Uttar Pradesh news, viral video

A first information report (FIR) has been filed against a woman who was seen thrashing a cab driver at a signal in Uttar Pradesh’s Lucknow. While it was earlier reported that the woman attacked the driver because he allegedly hit her, CCTV footage shows that the cab driver stopped at a zebra crossing while the woman was crossing the road, and the car is seen stopping right in front of her.

అరెస్ట్ లక్నో గర్ల్: నెటిజనుల ఆగ్రహానికి గురైన యువతిపై ఎఫ్ఐఆర్

Posted: 08/03/2021 08:37 PM IST
Fir registered against lucknow girl who thrashed cab driver in viral video

ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలోని అవధ్ క్రాస్ రోడ్స్ వద్దనున్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక యువతి అకారణంగా క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన ఘటనపై లక్నో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్ దాటుతున్న సమయంలో ఆదేరోడ్డులో వెళుతున్న క్యాబ్ డ్రైవర్ ఆమెను చూసి కారు ఆపి వేశాడు. కారు ఆమె ముందు ఆగటంతో మహిళ కోపంతో క్యాబ్ డ్రైవర్ వద్దకు వచ్చి కిందకు దింపి డ్రైవర్ ను చెంపదెబ్బలు కొట్టింది. మధ్యలో జోక్యం చేసుకుని గోడవను సద్దుమణిగేలా చేసిన వ్యక్తిపై కూడా అసభ్యకరంగా ప్రవర్తించింది.

రోడ్డుపై ఇంకా గ్రీన్ సిగ్నల్ పడకముందే రహదారిని క్రాస్ చేసుకుంటూ వచ్చేసిన యువతి.. తాను చేసిన తప్పును గ్రహించకుండా.. ఎదుటివారి తప్పులేకపోయినా .. వారిపై కోపంతో విరుచుకుపడటం.. ఎగిరెగిరి క్యాబ్ డ్రైవర్ చెంపెలను వాయించడం, అతని సెల్ ఫోన్ ను నేలకేసి కోట్టడం చేసింది. ఆ సమయంలో డ్రైవర్ తప్పులేకపోయినా మహిళ అనవసరంగా క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసింది. ఆ మహిళ, క్యాబ్ డ్రైవర్ ను కొట్టకుండా ఆపుదామని ప్రయత్నించిన కానిస్టేబుల్ ప్రయత్నం కూడా వృధా అయ్యింది. ఈ దృశ్యాన్నంతా అక్కడి సిసిటీవీలో జరిగిన యదార్థ ఘటన నెట్ జనుల ముందు పెట్టారు స్థానికులు.

దీంతో అమెపై నెటిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యువతిని నెటిజనులు ఏకిపారేశారు. అకారణంగా క్యాబ్ డ్రైవర్ ఫోన్ ను పగలగొట్టినందుకు.. నడిరోడ్డుపై అతడిపై చేయిచేసుకున్నందుకు అమెను అరెస్టు చేయాలని డిమాండ్ మొదలైంది. అరెస్ట్ లక్నో గర్ల్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దీంతో అమె ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసుల నెట్టింట్లో యువతిపై నెట్ జనుల ఆగ్రహాన్ని ఆపలేకపోతున్నారు. దీంతో ముందుగా యువతిపై కేసు నమోదు చేస్తూ ఎఫఐఆర్ నమోదు చేశారు. ఇక ఇప్పుడు దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికైనా నెట్ జనులు శాంతిస్తారుమో చూడాలిమరి.

కాగా, ఈ ఘటన జులై 30వ తేదీ  రాత్రి 9 గంటల 41 నిమిషాల సమయంలో లక్నోలోని కేసరి ఖేడా ట్రాఫిక్ క్రాసింగ్ వద్ద జరిగినట్లు సీసీటీవీ ఫుటేజి ద్వారా తెలుసుకున్నారు. ఈ సంఘటనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహిళ రోడ్డు దాటుతుండగా క్యాబ్ డ్రైవర్  ఆమె ముందు ఆపాడు.  దీంతో మహిళ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ డ్రైవర్ ను కొట్టింది. గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆ మహిళ రోడ్డు దాటిందని కూడా పోలీసులు గుర్తించారు. వాస్తవానికి అక్కడ ఉన్న సిగ్నల్   ఫ్రీ లెఫ్ట్   చూపిస్తుండంగా  వాహనాలు వేగంగా వెళుతుండగా  మహిళ రోడ్డు   దాటటానికి  ప్రయత్నించినట్లు వీడియోలో ఉంది. బాధితుడి ఫిర్యాదు మేరకు మహిళపై పోలీసులు కేస్ ఫైల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles