'Have Abhishek Banerjee’s call details': Suvendu amid Pegasus row పెగసస్ నిఘాకు బలం చేకూర్చుతున్న సువేందు వ్యాఖ్యలు

Pegasus row bjp s suvendu adhikari booked for call details access claims

Ashwini Vaishnaw, IT minister on Pegasus report, pegasus hack, Pegasus snooping row, West Bengal Pegasus spyware issue, Pegasus issue, Suvendu Adhikari, Abhishek Banerjee, Pegasus, Amit Shah, PM Modi, National Politics

In the middle of the Pegasus snoogate row, BJP MLA and Leader of Opposition in West Bengal Assembly, Suvendu Adhikari, has been booked by the police for his remark on the matter made during a rally in East Midnapore. A suo moto case has been registered at the Tamluk police station for his remark against the SP of East Midnapore, Amarnath K.

పెగసస్ నిఘాకు బలం చేకూర్చుతున్న సువేందు వ్యాఖ్యలు

Posted: 07/21/2021 12:39 PM IST
Pegasus row bjp s suvendu adhikari booked for call details access claims

ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ తో దేశంలోని పలువురు ప్ర‌ముఖుల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయన్న వార్త కథనం ప్రచురితమైన క్రమంలో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది. పెగాస‌స్ హ్యాకింగ్ నివేదిక‌పై పార్ల‌మెంటులోని ఉభయసభలను కుదిపేసింది. కేంద్రం హోం మంత్రి అమిత్ షాను తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పటికే విపకాల నుంచి పెరుగుతోంది. ఇక ఈ హ్యాకింగ్ ఘటనపై స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ప్రభుత్వం మాత్రం ఇవన్నీ సత్యదూరమైన వార్తలను ఖండిస్తోంది. ఈ నివేదికను కావాలనే పార్లమెంటు సమావేశాల ప్రారంభమైయ్యే రోజున విడుదల చేయించారని అనుమానాలను వ్యక్తం చేసింది.

ఇక ఇప్పటికే తన ఫోన్ అనేక సందర్భాల్లోనూ హ్యాకింగ్ కు గురయ్యిందని రాజ‌కీయ వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ అరోపించారు. అయితే నిజంగానే హ్యాకింగ్ జరిగిందా.? వాటితోనే కేంద్రానికి నేతల సమాచారం అందుతోందా.? అన్న అనుమానాలు పశ్చిమ బెంగాల్ బీజేపి శాసనసభ్యుడు సువేందు అధికారి వ్యాఖ్యలతో బలపడుతోంది. ఎందుకంటారా.?.  విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా సువెందు అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని ఓ బహిరంగ సభలో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి సువెందు మాట్లాడుతూ.. ఈస్ట్ మిడ్నాపూర్ ఎస్పీ కే అమ‌ర్‌నాథ్ కాల్ రికార్డుల‌న్నీ త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని అన్నారు. మమత మేన‌ల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీస్ నుంచి ఎవ‌రెవ‌రు ఎస్పీకి కాల్ చేస్తున్నారో అన్ని రికార్డులు తమ ద‌గ్గ‌ర ఉన్నాయన్నారు. ఎస్పీని ఉద్దేశించి మాట్లాడుతూ.. నీకు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటే మాకు కేంద్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంది అని సువేందు అన‌డం గ‌మ‌నార్హం. జాగ్ర‌త్త‌గా ఉండాలని ఎస్పీకి సువెందు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

అమ‌ర్‌నాథ్ అనే ఓ యువకుడు ఇక్క‌డికి ఎస్పీగా వ‌చ్చాడు. అత‌నేంటో నాకు తెలుసు. అత‌నికి ఒక్క‌టే చెప్ప‌ద‌ల‌చుకున్నా. నువ్వో సెంట్ర‌ల్ కేడ‌ర్ అధికారివి. నిన్ను క‌శ్మీర్లోని అనంత్ నాగ్ లేదా బారాముల్లాకు ట్రాన్స్ ఫ‌ర్ చేసేలా ఏ ప‌నీ చేయొద్ద‌ని చెబుతున్నా అని సువేందు అన్నారు. సీబీఐ తర్వలోనే ఐఓలు, ఐసీలు, ఓసీల పాత్రపై దర్యాప్తు చేస్తుందని.. మమతా బెనర్జీని ఆంటీగా సంబోధిస్తూ..ఏ ఆంటీ నిన్ను కాపాడలేదు అని ఎస్పీని ఉద్దేశించి సువెందు అధికారి అన్నారు. కాగా, సువేందుపై ఉన్న ఆరోప‌ణ‌ల‌పై మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించిన స‌మ‌యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

2018లో ఆయ‌న సెక్యూరిటీ గార్డ్ హ‌త్య‌పై సీఐడీ, ఓ దొంగ‌త‌నం కేసులో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. మరోవైపు, ఎస్పీ ఫోన్ కాల్ రికార్డింగ్ లు తమ వద్ద ఉన్నాయంటూ సువెందు అధికారి చేసిన వ్యాఖ్యలపై ఈస్ట్ మిడ్నాపూర్ పోలీసులు ఆయనపై మూడు సుమోటో కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాధికారులను.. బెదిరించడం,అవమానించడం,వారి ఫోన్లను ట్యాపింగ్ చేయడం వంటి ఆరోపణలపై సువెందుపై కేసులు నమోదు చేశారు. అఫిషీయల్ సీక్రెసీ చట్టం కూడా సువెందు పై కేసు నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh