Neurologist spies Lady Doctor in her bathroom లేడీ డాక్టర్ బాత్ రూమ్ లో స్పై కెమెరాలు పెట్టిన న్యూరాలజిస్ట్

Doctor arrested after spy cameras found in woman doctor s bathroom

MD doctor, lady doctor, CCTV cameras, Police case, spy act, stalker, Neurologist, Dr Sujit Abajirao Jagtap, Lady doctor, spy camera, bathroom, bedroom, police case, Bharti Vidyapeeth police station, Jagannath Kalaskar, Pune, Maharashtra, Crime

Pune Doctor Arrested: A 42-year-old neurologist was arrested for allegedly installing spy cameras in his trainee doctor’s bathroom and bedroom residential quarters as per the statement given by the police. The incident took place in Maharashtra’s Pune.

లేడీ డాక్టర్ బాత్ రూమ్ లో స్పై కెమెరాలు పెట్టిన న్యూరాలజిస్ట్

Posted: 07/14/2021 01:31 PM IST
Doctor arrested after spy cameras found in woman doctor s bathroom

సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడం ఎంత ముఖ్యమో.. ఆ స్థానంలో మంచి పేరు ప్రతిష్టలతో కొనసాగడం కూడా అంతే ముఖ్యం. ఉన్నత స్థానంలో కొనసాగుతున్న వారు చేసే స్థాయి తక్కువ పనులతో వారు కీర్తప్రతిష్టలకు కూడా చెడ్డు పేరు అపాదించబడుతోంది. సరిగ్గా ఇలానే జరిగింది మహారాష్ట్రలోని పూణేలో. ఓ ప్రముఖ మెడికల్ కాలేజీలో న్యూరోలజీ లెక్చరర్ గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు తన సొంత క్లినిక్ కూడా వున్న ఓ న్యూరాలజిస్టు చేయకూడని పని చేసి తనకు తానే అపఖ్యాతి పాలయ్యాడు. అంతేకాదు కటకటాలు కూడా లెక్కపెడుతున్నాడు. పూణే నగరంలోని ప్రముఖ అసుపత్రుల్లోనూ కన్సల్టెంట్ న్యూరోలజిస్టుగా సేవలందించే ఆయన గురించి తెలిసిన స్థానికులు ఇంత దారుణానికి ఒడిగట్టాడా.? అంటూ విస్మయానికి గురవుతున్నారు.

పూణేలోని ప్రముఖ మెడికల్ కాలేజీలో ఎండీ విభాగంలో వైద్యురాలైన ఓ మహిళా డాక్టర్ అక్కడ ఎండీ ట్రైనీగా విధులు నిర్వహిస్తున్నారు. అమెకు కాలేజీ అవరణలోనే అసుపత్రి యాజమాన్యం అమె నివాసముండేందుకు రెసిడెన్షియల్ క్వార్టర్స్ లో గదిని కేటాయించింది. అయితే తన గదిలోని బాత్ రూమ్ లో లైటు వెలగకపోవడంతో అమె మరమ్మతు కోసం ఎలక్ట్రీషియన్ ను పిలిపించింది. అయితే మరమ్మతు చేస్తుండగా, అందులోంచి స్పై కెమెరా బయటపడింది. దీంతో అప్రమత్తమైన వైద్యురాలు ఇంట్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించగా పడకగదిలో మరోటి కనిపించింది.

దీంతో విస్తుపోయిన ఆమె వెంటనే స్థానిక భారతీ విద్యాపీత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను అర్థంచేసుకున్న పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సిసిటీవీ ఆధారంగా లేడీ డాక్టర్ గది వైపుకు వెళ్లిన వారిని గమనించగా, అదే మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 42 ఏళ్ల న్యూరాలజిస్ట్ అనుమానాస్పదంగా కనిపించాడు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు రోజుల పాటు విచారించగా, తానే ఈ దారుణానికి పాల్పడినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదిగిన డాక్టర్.. ఇలాంటి పనులు చేయడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles