Tirath Singh Rawat resigns as Uttarakhand CM ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ రావత్ రాజీనామా..

Tirath singh rawat resigns bjp to have third cm in uttarakhand in four months

Tirath Singh Rawat, Tirath Singh Rawat resigns, Uttarakhand CM resigns, Uttarakhand CM news, Tirath Singh Rawat news, Tirath Singh Rawat resignation, Uttarakhand news, Uttarakhand BJP, Uttarakhand CM news, Uttarakhand CM Change, Uttarakhand elections, Tirath Singh Rawat news

Uttarakhand Chief Minister Tirath Singh Rawat resigned late on Friday night, less than four months after taking over, and hours after holding a press conference to talk about the achievements of his government.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ రావత్ రాజీనామా.. నాలుగు నెలల్లో మూడో సీఎం..

Posted: 07/03/2021 12:31 PM IST
Tirath singh rawat resigns bjp to have third cm in uttarakhand in four months

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాత్రి పోద్దుపోయిన తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలల లోపునే ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. క్రితం రోజు రాత్రి పదకొండు గంటల సమయం దాటిన తరువాత ఆయన తన క్యాబినెట్ మంత్రులను వెంటబెట్టుకుని రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ బేబి రాణి మౌర్య కలసి ఆమెకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరత్ సింగ్ ఆరు నెలల లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఎన్నికలు జరగడం అనుమానంగానే ఉంది. గడువు ముగిసే వరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉండడంతో దానిని నివారించేందుకు ముందస్తుగా ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సొంతపార్టీ నుంచి కూడా ఆయనకు నిరసన సెగ మొదలైంది.

ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసిన తీరత్ సింగ్ నిన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రంలో రాజకీయంగా సమస్యలు ఉత్పన్నం కావడాన్ని అధిష్టానం దృష్టిసారించింది. దీంతో అంతర్గతంగా పరిస్థితులను చక్కదిద్దేందుకు తీరత్ సింగ్ రావత్ ను రాజీనమా చేయాలని అదేశించినట్లు సమాచారం. దీంతో తీరత్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తీరత్ సింగ్ ప్రస్తుతం గర్వాల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఈసారి సిట్టింగ్ అభ్యర్థికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles