Thane man receives a call to collect his death certificate ‘‘హలో.. మీ డెత్ సర్టిఫికెట్ రెడీ..’’ ఇది సినిమా డైలాగ్ కాదు..

Thane teacher gets call from civic body to collect his own death certificate

Thane Municipal Corporation, ICMR, Chandrashekar Desai, Death Certificate, School Teacher, coronavirus, Covid-19, Maharashtra, crime

A 55-year-old school teacher in Thane got a shock of his life when he received a call earlier this week from the Thane Municipal Corporation (TMC) that his death certificate was ready and he should come and collect it.

‘‘హలో.. మీ డెత్ సర్టిఫికెట్ రెడీ..’’ ఇది సినిమా డైలాగ్ కాదు..

Posted: 07/03/2021 11:38 AM IST
Thane teacher gets call from civic body to collect his own death certificate

కరోనామహమ్మారి అనేకానేకులను మృత్యువాత పడేట్లు చేయడంతో పురపాలక సంఘం అధికారులకు వారి పేరున డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడంలోనూ పూర్తి బిజిగా మారారు. అయితే సాధారణ సమయంలో డెత్ సర్టిఫికెట్ ఇమ్మంటే లంచం ఇస్తేనే గానీ జరగని పనులు.. ఇప్పుడు ఆపద సమయంలో మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. అయితే గతంలో బతికున్న వ్యక్తులు చనిపోయారని డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఘటనల గురించి విన్నాం. కానీ ఏకంగా బతికున్న వ్యక్తికే ఫోన్ చేసి ‘నీ డెత్​ సర్టిఫికేట్​ రెడీగా ఉంది వచ్చి తీసుకెళ్లు అని ఫోన్ చేసిన అధికారుల గురించి ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? అటువంటి ఘనకార్యమే చేశారు అధికారులు.

మహారాష్ట్రలోని థానే మున్సిపల్ అధికారులు చంద్రశేఖర్ అనే 55 ఏళ్ల ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి.. మీ డెత్ సర్టిఫికెట్ రెడీగా వుంది వచ్చి తీసుకెళ్లండీ అన్నారు. దీంతో షాక్ తిన్న చంద్రశేఖర్.. తేరుకుని ఏంటీ అని అడగ్గా మళ్లీ అదే మాట వినబడింది. దీంతో చంద్రశేఖర్ కు మండిపోయింది. కాస్త వెటకారంగా ‘హలో సార్.. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది ఆ మరణించిన వ్యక్తితోనే.. మీరు డెత్ సర్టిఫికెట్ రెడీ చేసిన వ్యక్తితోనే.. ఎప్పుడు రమ్మంటారు? నా డెత్ సర్టిఫికెట్ కలెక్ట్ చేసుకోవటానికి’? అని అడుగగా..ఈ సారి షాక్ అవ్వటం సదరు అధికారి వంతు అయ్యింది. దానికి మాట మారుస్తూ..‘మీ కుటుంబంలో ఎవరైనా కోవిడ్​తో మరణించారా? అని ప్రశ్నించారు. దానికి చంద్రశేఖర్ లేదని చెప్పడంతో ఫోన్​ కట్ చేశారు.

అధికారులు ఫోన్ కట్ చేశాక చంద్రశేఖర్ దేశాయ్ ..అసలు జరిగింది ఏంటో తెలుసుకునేందుకు థానే మున్నిపల్​ కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ తన పేరుతోను అన్ని వివరాలతోను ఉన్న డెత్ సర్టిఫికెట్​ అడిగి తీసుకని దాన్ని పూర్తిగా పరిశీలించి మరోసారి అవాక్కయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నుంచి వచ్చిన సమాచారం ప్రకారం..చంద్రశేఖర్ దేశాయ్ 2021 ఏప్రిల్ 22 న మరణించాడని అందులో ఉంది. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందనే విషయంపై అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles