"Even 1 Fatality.. ₹ 1 crore compensation..": SC Over Class 12 Exam ‘‘ఒక్క విద్యార్థి మరణించినా.. కోటి పరిహారం’’: ఏపీకి సుప్రీం హెచ్చరిక

Even 1 fatality 1 crore compensation supreme court questions andhra over class 12 exam

Andhra pradesh intermiediate exams, andhra pradesh class 12th exam, ap ssc, ap inter exam, ap board exam news, Supreme court, Intermediate exams, student, fatality, RS 1 Crore Compensation, supreme court, Andhra Government, Fatality, class 12 exams, class 10th exams, Intermediate exams, Andhra pradesh

The Andhra Pradesh government will be held responsible "if there is even one fatality" as a result of holding in-session Class 12 exams next month, the Supreme Court said Thursday. The court also said it "may order compensation amounting to ₹ 1 crore" in the event of any deaths.

‘‘ఒక్క విద్యార్థి మరణించినా.. కోటి పరిహారం’’: ఏపీకి సుప్రీం హెచ్చరిక

Posted: 06/24/2021 02:53 PM IST
Even 1 fatality 1 crore compensation supreme court questions andhra over class 12 exam

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు విద్యార్థుల ప్రాణాలకు విలువనిచ్చి.. పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, అందుకు గల కారణాలు ఏమిటని ప్రశ్నించింది. 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ద్దు చేయ‌లేదు. ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని కోర్టులో అఫిడెవిట్ కూడా స‌మ‌ర్పించింది. దీంతో అత్యున్న‌త న్యాయ‌స్థానం తీవ్రంగా స్పందించింది. అసలు పరీక్షలను నిర్వహిస్తామన్న నిర్ణయాన్ని తీసుకున్న అసలు వ్యక్తి ఎవరని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఇదివరకే పరీక్షలను నిర్వహిస్తే.. వాటి వల్ల ఒక్కరు మరణించినా.. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఒక్కరు మరణించినా వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సి వుంటుందని హెచ్చరించింది. కోవిడ్ వల్ల మరణించిన మృతులకు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు పలు రాష్ట్రాలు కోటి రూపాయల పరిహారం అందిస్తున్నాయని.. ఈ క్రమంలో తాము అదే మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని చెప్పాల్సివస్తుందని జస్టిస్ ఖాన్ విల్క‌ర్, జస్టిస్ దినేష్ మహశ్వరీలతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం తెలిపింది.

దేశంలోని పలు రాష్ట్రాల బోర్డులు వాస్తవిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పరీక్షలను రద్దు చేశాయని పేర్కోంది. తాజాగా కొత్తగా డెల్టా ప్లస్ రకం కరోనా ప్రభావం చూపనుందని, ఈ రకం కరోనా ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కూడా ఎవరికీ తెలియదని, ఇలాంటి తరుణంలో పరీక్షలను నిర్వహిస్తామని నిర్ణయం తీసుకున్న వారు ఎవరని న్యాయస్థానం ప్రశ్నించింది. అసలు ఏ పారామీటర్లపై పరీక్షలను నిర్వహిచాలన్న నిర్ణయం తీసుకున్నారని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. ఏపీలో బోర్డు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోర్టు ఈ హెచ్చ‌రిక చేసింది.

ఇది విద్యార్థుల, వారి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, వారి కుటుంబసభ్యుల అరోగ్యానికి సంబంధించిన అంశమని.. మొత్తంగా ప్రజారోగ్యానికి సంబంధించిన అంశంలో అలక్ష్యం వద్దని.,. జాగరుకత అవసరమని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంపై తాము సంతృప్తికరంగా లేమని.. అందుకు సంబంధించిన ప్రణాళికపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మ‌హ‌మ్మారి వేళ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఎలా నిర్ణ‌యం తీసుకుంద‌ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది.

కాగా, రాష్ట్రంలోని 5.2 ల‌క్ష‌ల మంది విద్యార్థులను 34 వేల రూముల్లో ఎలా కూర్చోబెడుతారో వివ‌రించాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని కోర్టు కోరింది. ప్ర‌తి ఒక రూమ్‌లో క‌నీసం 18 మంది విద్యార్థుల‌ను కూర్చోబెట్ట‌నున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం కోర్టుకు చెప్పింది. సెకండ్ వేవ్‌లో ఏం జ‌రిగిందో చూశామ‌ని, ప‌లు రకాల వేరియంట్లు దాడి చేస్తున్న స‌మ‌యంలో మీరెందుకు ఇలా నిర్ణ‌యం తీసుకున్నార‌ని కోర్టు అడిగింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు 15 రోజుల స‌మ‌యం ఎలా స‌రిపోతుంద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. జ‌స్టిస్ ఖాన్‌విల్క‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసు విచారించింది. రేపు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు కేసు వాయిదా ప‌డింది. ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున అడ్వ‌కేట్ మ‌హ‌ఫూజ్ న‌జ్కీ వాదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles