AP CM requests PM to allow sharing of Covaxin technology వాక్సీన్ సాంకేతికతను బదలాయించండీ: ప్రధానికి సీఎం జగన్ లేఖ

Jagan mohan reddy asks pm modi to transfer covaxins technology to capable firms

vaccine technology transfer, IPR of vaccine, ys jagan mohan reddy, Andhra cm asks for vaccine tech transfer, india vaccine manufacturing capacity, vaccine manufacturer, covaxin, bharat biotech, icmr, patent of covaxin

Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy wrote to Prime Minister Narendra Modi on Tuesday, urging him to direct Bharat Biotech to transfer vaccine manufacturing technology of Covaxin to those capable and willing to produce Covid-19 vaccines, in order to help the country meet its vaccine demand.

వాగ్జీన్ సాంకేతికతను బదలాయించండీ: ప్రధానికి సీఎం జగన్ లేఖ

Posted: 05/11/2021 11:49 PM IST
Jagan mohan reddy asks pm modi to transfer covaxins technology to capable firms

కరోనా మహమ్మారి జడలు విప్పి కళారనృత్యం చేస్తున్న నేపథ్యంలో దీని బారిన పడకుండా రాష్ట్ర ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు కరోనా వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్నారు. అయితే ఒక్కసారిగా ఊహించని విధంగా వాక్సీన్ కొరత ఏర్పడింది. అంతేకాదు ఇటు వాక్సీన్ కొరతతో పాటు అటు కరోనాను నయం చేస్తున్న రెమిడిసివీర్ మందు, అక్సిజన్సిలిండర్ల కొరత కూడా ఏర్పడింది. దీంతో ఇదివరకే పలు పర్యాయాలు కేంద్రానికి పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోని పరిస్థితిని విన్నవించాయి. తమకు అక్సిజన్ కేటాయింపులు కల్పించాలని, కరోనా ఔషదాలతో పాటు వాక్సీన్ స్టాక్ ను కూడా అధికంగా పంఫిణీ చేయాలని కోరుతున్నాయి.

ఇలా అటు ఆక్సిజన్, రెమిడిసివిర్, సహా ఇటు కోవిడ్ వాక్సీన్ కొరతతో సతమతమవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటిగా నిలిచింది. అదే సమయంలో దేశంలోనే రోజువారీగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లోనూ ఈ రాష్ట్రం పదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కేంద్రానికి ఆసక్తికర ప్రతిపాదన చేశారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి అందుకు సంబంధించిన సాంకేతిక ఫార్ములాను ఇతర సంస్థలకు కూడా అందిస్తే, వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందని ఏపీ సీఎం జగన్ సూచించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు.

రాష్ట్రంలో కరోనా నిబంధనలను ఎంత పటిష్టంగా అమలుచేసినా.. వ్యాక్సినేషన్ ఒక్కటే తిరుగులేని పరిష్కారం అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అయితే వాక్సీన్ కొరత కారణంగా దేశంలోని ప్రతీ పౌరుడికి వాక్సీన్ అందించే పరిస్థితి లేకపోవడం విచారం కలిగిస్తుందని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలినాళ్లలో రాష్ట్రంలో ప్రతీ రోజు ఆరు లక్షల డోసులు ఇచ్చేవారమని, కానీ ఇప్పుడు తగినన్ని డోసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. ఐసీఎంఆర్, ఎన్ఐవీ సంస్థల సహకారంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినా, దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయడంలో ఆ సంస్థ సామర్థ్యం సరిపోవడంలేదని అన్నారు.

భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తిలో రేటు చాలా తక్కువగా వుందని, పరిస్థితి ఇలానే కొనసాగితే.. ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇవ్వాలంటే ఎన్నో నెలలు పడుతుందని ఆయన తన లేఖలో పేర్కోన్నారు. దీనికి బదులుగా కొవాగ్జిన్ సాంకేతికతను టీకా ఉత్పత్తి చేయగల ఇతర సంస్థలకు బదలాయిస్తే.. ఉత్తత్పని వేగవంతం చేసి.. రానున్న కొన్ని నెలల్లో దేశపౌరులందరికీ వాక్సీన్ ను అందించవచ్చునని అన్నారు. అందుకు టీకా తయారీ సాంకేతిక సమాచారాన్ని ఇతర సంస్థలతో పంచుకునేలా భారత్ బయోటెక్ ను ఆదేశించాలని కోరారు. ఈ కష్టకాలంలో యావత్ ఉత్పత్తిరంగం టీకా తయారీ దిశగా కదలాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ ఉద్ఘాటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles