'Double mutant' Covid variant found in India దేశంలో 771 రకాల కరోనా వైరస్లు.. డబుల్ మ్యుటెంట్ కూడా..

Covid 19 double mutant strain 771 variants detected in india says govt

India Coronavirus Cases, Coronavirus, coronavirus news, india covid 19 news, covid 19 vaccine, coronavirus india, coronavirus Telangana, coronavirus Andhra Pradesh, coronavirus maharashtra, coronavirus india news, corona cases in india, india news, coronavirus news, covid 19 latest news, maharashtra covid 19 cases

A double mutation found in the Sars-CoV-2 virus that causes coronavirus disease (Covid-19) in Maharashtra is of concern as these mutations have not been yet catalogued, the Union ministry of health and family welfare announced.

దేశంలో 771 రకాల కరోనా వైరస్లు.. డబుల్ మ్యుటెంట్ కూడా..

Posted: 03/24/2021 07:19 PM IST
Covid 19 double mutant strain 771 variants detected in india says govt

దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న వేళ.. అసలు ఏలాంటి కరోనా మహమ్మారి దేశ ప్రజలను పట్టి పీడిస్తుందని పరిశోధించన వైద్యులకు విస్తుపోయే విషయాలు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం మన దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 771 రకాల కరోనా వైరస్లు దేశ ప్రజలను బాధిస్తున్నాయి. అందులో ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా మన దేశంలో ఇప్పుడు వెలుగు చూసింది. ‘డబుల్ మ్యుటెంట్’ రకం అని దానిని పిలుస్తున్నారు. ఈ వివరాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. ఈ కొత్త కరోనా వైరస్ లు, డబుల్ మ్యుటెంట్ వైరస్ గురించి పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించిన కరోనా పాజిటివ్ శాంపిళ్లలో 10,787 శాంపిళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. 771 కొత్త రకాల కరోనా ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ కరోనా రకాల్లోని 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం కరోనా ఉందని నిర్ధారించినట్టు పేర్కొంది. ఇంకో 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా రకం ఉన్నట్టు తేల్చింది. ఇంకో శాంపిల్ లో బ్రెజిల్ రకం ఉందని పేర్కొంది. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా ఆనవాళ్లున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాటికి అదనంగా డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు గుర్తించింది.

ఈ జన్యు క్రమ విశ్లేషణ చేసిన శాంపిళ్లన్నీ అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు దేశంలోని వివిధ కమ్యూనిటీల నుంచి తీసుకున్నవేనని పేర్కొంది. మహారాష్ట్రలోని శాంపిళ్లను పరిశీలించగా ఈ484క్యూ, ఎల్452ఆర్ జన్యు పరివర్తనలు కలిగిన డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు తేలిందన్నారు. గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే ఇప్పుడు అవి ఎక్కువయ్యాయని తెలిపింది. ఇలాంటి మ్యుటెంట్ కరోనాలు రోగ నిరోధక వ్యవస్థకు దొరక్కుండా తప్పించుకుంటాయని వెల్లడించింది. ఈ రెండు మ్యుటేషన్లు దాదాపు 20 శాతం శాంపిళ్లలో ఉన్నాయని చెప్పింది. కేరళలోని 14 జిల్లాల నుంచి 2,032 శాంపిళ్లను పరిశీలించగా ఎన్440కే వేరియంట్ ఉన్నట్టు తేలిందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

11 జిల్లాల్లోని 123 శాంపిళ్లను పరిశీలించగా.. ఈ వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్ ను దాటుకుని మనగలిగిందని వెల్లడించింది. ఇంతకుముందు తెలంగాణలోని 104 శాంపిళ్లకుగానూ 53 శాంపిళ్లు, ఏపీలో 33 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి 16 దేశాల్లోనూ ఈ వేరియంట్ మూలాలున్నాయని చెప్పింది. ప్రస్తుతం ఈ డబుల్ మ్యుటెంట్ కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయని, దీనివల్లే కేసులు పెరుగుతున్నాయా? అన్న దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles