Bharat Bandh against GST, fuel price hike కొనసాగుతున్న భారత్ బంద్.. దేశంలో ఒకే రకంగా ఇంధన ధరలకు డిమాండ్

Bharat bandh today against gst fuel price hike e way bill

bharat bandh, bharat bandh today, bharat bandh date 26th February 2021, 26 February Bharat Bandh, bharat bandh news, today is bharat bandh, industry news, industry growth, indian industry news, Indian Economy, Finance

All commercial markets across the country will remain closed across the country today (26 February) in view of the Bharat Bandh called by the Confederation of All India Traders (CAIT) in protest against rising fuel prices, the new e-way bill and the goods and services tax (GST).

కొనసాగుతున్న భారత్ బంద్.. దేశంలో ఒకే రకంగా ఇంధన ధరలకు డిమాండ్

Posted: 02/26/2021 10:35 AM IST
Bharat bandh today against gst fuel price hike e way bill

చమురు ధరలు భగ్గుమంటుండడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే తరహాలో ఇంధన ధరలు వుండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత వర్తక సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్) పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. దీనికి తోడు నూతన వే బిల్లులో పలు సవరణలు చేయాలని కూడా వర్తక సమాఖ్య డిమాండ్ చేస్తోంది. అటు జీఎస్టీని కూడా సవరించాలని వర్తక సమాఖ్య కేంద్రం ముందు తమ డిమాండ్లను ఉంచింది.

దేశ వ్యాప్తంగా ఏకంగా 40 వేల వర్తక ట్రేడ్ అసోసియేషన్లు ఈ బంద్ లో పాల్గోంటున్నాయి. దీనికి తోడు ఈ బంద్ కు చార్టర్డ్ అకౌంటెంట్ యూనియన్లు కూడా మద్దుతు ప్రకటించడంతో వర్తకులకు పిలుపు బలం చేకూరింది. ఇక మరోవైపు ఈ బంద్ కు లారీ యజమానుల సంఘంతో పాటు ఈ బంద్‌కు అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం (ఏఐటీడబ్ల్యూఏ) తమ మద్దతు పలికింది. ఇందులో భాగంగా చక్కాజామ్‌కు పిలుపునిస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా అంతరాష్ట్రాల మధ్య నడిచే దాదాపు నలభై లక్షల వాహనాలు కూడా ఇవాళ రోడ్లపైకి రావని తెలిపింది.

ఇక మరోవైపు భారత్ బంద్ కు ఉత్తర భారతంలోని రైతు సంఘాలు కూడా మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా 1,500 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరలు, గ్యాస్ ధరలతో పాటు జీఎస్టీని సవరించాలని, ఇక అత్యంత కీలమైన ఈ వే బిల్లులోని పలు చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. వీటిని వెంటనే తగ్గించాలని, ఏటా టోల్ రేట్ల పెంపుదలను నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం తగ్గించాలని స్పష్టం చేశారు.

భారత్ బంద్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రోడ్లపైకి భారీ వాహనాలు రావడం లేదు. ఒడిషాలోని భువనేశ్వర్ లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం వాహనాల రద్దీతో నిండే రోడ్లు ఇవాళ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటల వరకు బంద్ కోనసాగుతుందని వర్తక సమాఖ్య తెలిపింది. అయితే బంద్ కారణంగా అత్యవసర సేవలతో పాటు మెడికల్ దుకాణాలు, పాలు, కూరగాయలు, బ్యాంకు సేవలకు ఎలాంటి అంతరాయం కలగించబోమని వారు తెలిపారు. ఇక 2018 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ వే బిల్లులో పలు సవరణలు చేయాలని.. ఈ బిల్లులో కేంద్రం సూచించిన విధానాలు అచరణ సాధ్యం కాదని రవాణ సంఘం నేతలు తేల్చిచెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles