గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య ఏర్పడిన పోరపచ్చాలు.. చివరకు తొలగిపోయాయి. దీంతో రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికలతో పాటు జడ్సీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ వినతిపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనువెంటనే స్పందించి ఇవాళ షెడ్యూల్ విడుదల చేశారు. గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిలిచిన విషయం తెలిసిందే.
ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే ఎన్నికలను కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ.. మొత్తం 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపల్, నగర పంచాయతీలకు ఎన్నికలు నగారాను మ్రోగిస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 10వ తేదీన మున్సిఫల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చేనెల 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీని విధించారు. కాగా, గత ఏడాది మార్చి 23న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఏర్పాట్లు చేసుకోగా కరోనా విజృంభణ కారణంగా వాయిదాపడ్డ విషయం తెలిసిందే.
అయితే అప్పట్లో విడుదల చేసిన షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ ప్రకారం 12 నగరపాలక సంస్థల్లో 6,563 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు వేశారు. దీంతో నామినేషన్ల గడువుకు ముగిసిన నేపథ్యంలో కేవలం ఉపసంహరణలు, ఎన్నికలు, కౌంటింగ్ తేదీలను మాత్రమే నిర్వహించనుంది. మరోవైపు, ప్రస్తుతం పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి రెండు దశల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలకు కూడా ఎస్ఈసీ సిద్ధమయింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more