భక్తితో దైవ దర్శనం చేసుకుని సొంతవూరికి తిరుగు ప్రయాణమైన తెలుగు వారికి మహారాష్ట్రలో అర్థరాత్రి దోపిడీ దొంగలు దారి కాచి వారిని లూఠీీ చేశారు. మహిళలు, చిన్నారుల అన్న తేడా లేకుండా విలువైన బంగారు అభరణాలు, నగదు సహా అన్ని దోచుకెళ్లారు. అంతేకాదు వీరిని అడ్డగించేందుకు వారు చేసిన ప్రయత్నాలను దాటి వెళ్తున్నారని వారిపై కనీస కనికరం కూడా లేకుండా కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. తెలంగాణ వారిని ఉల్లిక్కిపడేలా చేసిన ఈ ఘటన మహరాష్ట్రలోని వాసీ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
అర్థరాత్రి ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా.. ముందుచూపుతో వ్యవహరించాలని పెద్దలు చెబుతూనే వుంటారు. అయినా ఉదయం వేళకు ఇళ్లకు చేరుకుని సకాలంలో విధులకు హాజరయ్యేందుకు అనేకమంది రాత్రి ప్రయాణాలకు అధికంగా మొగ్గుచూపుతుంటారు. అయితే మహారాష్ట్రకు మాత్రం రాత్రివేళ ప్రయాణాలుప్రమాదకరం. గతంలోనూ తలెంగాణ టూరిజానికి చెందిన బస్సులతో పాటు ప్రైవేటు బస్సులను టార్గెట్ చేసుకున్న దోపిడీ దొంగలు.. బస్సులపై రాళ్లు రువ్వుతూ దాడులకు పాల్పడి దొపిడీలకు తెగబడిన ఘటనలు వున్నాయి.
తాజాగా వికారాబాద్ జిల్లాకు చెందిన రెండు కుటుంబాలు క్రితం రోజు రాత్రి ప్రయాణంలో దోపిడీ దొంగల దాడిలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ జిల్లా బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. పరిగి నియోజకవర్గ పరిధిలోని కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రమేశ్. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు. షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. కర్నాటకలోని వాసీ పోలీస్స్టేషన్ పరిధిలోకి రాగానే దొంగలు వీరి కారును అడ్డగించారు. రోడ్డుపై మేకులు వేసి కారు పంక్చరయ్యేలా చేశారు.
అయితే దొంగలను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొడుతూ.. కత్తులతో బెదిరిస్తూ డబ్బులు, ఆభరణాలు వసూల్ చేశారు. దీంతో ప్రాణభయంతో వారంతా తమ వద్ద ఉన్న ఆభరణాలు, నగదు ఇచ్చేశారు. ప్రస్తుతం కర్నాటకలోని హుమ్నాబాద్లో ఉన్న ఓ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా కత్తులు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారని తెలుస్తోంది. వీరి దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి వద్ద నుంచి 8 తులాల బంగారు నగలను దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన వాసీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more