People supposed to walk in air: HC on lack of footpaths పుల్ పాత్ లు ఎక్కడ.? జీహెచ్ఎంసీకి హైకోర్టు ప్రశ్న

Clear footpaths and pavements telangana high court to ghmc

telangana high court, footpaths, pavements, encroachment, pedestrians, vendors, GHMC, Hyderabad, Gadwala Vijaya Lakshmi, GHMC Mayor, Mothe Srilatha, GHMC deputy Mayor, TRS party, 17th Mayor of GHMC, Swetha Mohanthy, Hyderabad collector, Telangana, Politics

The High Court directed GHMC and Police authorities to clear all the footpaths and pavements encroached by vendors in the city of Hyderabad. The court asked the GHMC officials to survey the entire city and construct new footpaths wherever necessary.

పాదచారులు నడిచే ఫుట్ పాత్ ఎక్కడ.? జీహెచ్ఎంసీకి హైకోర్టు ప్రశ్న

Posted: 02/12/2021 07:13 PM IST
Clear footpaths and pavements telangana high court to ghmc

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాదచారులు గాల్లో నడవాలా.? లేక వారికి రోడ్డుపై నడిచే హక్కు లేదా.? అంటూ తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఫుట్ పాత్ లపై వెంటనే ఆక్రమణలను తొలగించాలని, ఇంతకుముందు తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయి నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమగ్ర సర్వే చేసి గతంలో ఉన్న ఫుట్ పాత్ లను తొలగిస్తే ఆ ప్రాంతంలో తిరిగి నిర్మించాలని, ప్రజలు సౌకర్యం గా నడిచేలా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

నగరంలో ఫుట్ పాత్ లు ఆక్రమణలపై న్యాయవాది మామిడాల తిరుమల రావు వ్యక్తిగతంగా ప్రజాప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఫుట్ ఫాత్ లు ఆక్రమణలకు గురవుతున్నా గ్రేటర్ హైదరాబాద్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ఆయన పిటీషన్ లో పేర్కోన్నారు. ఆయన దాఖలు చేసిన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతా ల్లో ఫుట్ పాత్లను తొలగించారని, కొన్ని చోట్ల వాటిని వీధి వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారని తిరుమలరావు వివరించారు.

దీంతో గత్యంతరం లేక పాదచారులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఈ సమయంలో ప్రమాదాలు జరిగితే పాదచారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కోంటున్నారని తెలిపారు. ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ మార్గదర్శకాల ప్రకారం ఫుట్ పాత్లను నిర్మించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని వివరించారు. ఈ పిటిషన్ లో నగర పోలీసు కమిషనర్ ను ఎందుకు ప్రతివాదిగా చేర్చారని ధర్మాసనం ప్రశ్నించగా.. కమిషనర్‌ కార్యాలయంతోపాటు పోలీస్ స్టేషన్ల ఎదురుగా రోడ్లపైనే వాహనాలను అడ్డగోలుగా పార్క్‌ చేస్తున్నా పట్టించుకోవట్లేదని నివేదించారు.

‘రోడ్లు విస్తరణ చేయడంతో ఫుట్ పాత్లను తొలగిస్తున్నారు. 1990ల్లో 10 ఫీట్లున్న ఫుట్ పాత్లు రోడ్ల విస్తరణతో 5 ఫీట్లకు తగ్గాయి. ఇటీవల మెట్రో నిర్మాణానికి సంబంధించి పిల్లర్లను ఏర్పాటు చేయడంలో పూర్తిగా ఫుట్ పాత్లను తొలగించారు. అక్కడక్కడ ఉన్న ఫుట్ పాత్లను చిరువ్యాపారులు ఆక్రమించుకుంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నార’ని జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి పేర్కొన్నారు. చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా ప్రాంతాన్ని కేటాయించలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. కొన్ని ప్రదేశాలను కేటాయించామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, ఈ దిశగా తామిచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana high court  footpaths  pavements  encroachment  pedestrians  vendors  GHMC  Hyderabad  Telangana  Politics  

Other Articles