79 lakh Telanganites to get Covid-19 vaccine తొలి విడతలో 79 లక్షల మందికి కోవిడ్ వాక్సీన్

Telangana 79 lakh people above 50 to get covid 19 vaccine shot on priority

Hyderabad, vaccine shot, corona vaccination, healthcare workers, Police department, municipal staff, Panchayat workers, above 50 people, covid-19 vaccine, covid-19 in telangana, covid-19, Telangana

Telangana has 79 lakh people above 50 years, which is one of the four categories of beneficiaries. State health authorities peg number of people above 50 to be around 67 lakh and the number of beneficiaries could be around 80 lakh to 85 lakh. Telangana has been allotted 1.6 crore doses by the Centre, which would most likely come in a phased manner.

కరోనా టీకా పంపణీ ఏర్పాట్లు: తొలి విడతలో 79 లక్షల మందికి వాక్సీన్

Posted: 12/16/2020 10:36 PM IST
Telangana 79 lakh people above 50 to get covid 19 vaccine shot on priority

కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు టీకా అందుబాటులోకి రాగానే దానిని త్వరితగతిన పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేప్టటింది. రాష్ట్రంలో 50 ఏళ్ల వయస్సు దాటిన వారితో పాటు హెల్త్ వర్కుర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్ద్య కార్మికులు అందరికీ తొలి విడతలో ప్రాధాన్యత క్రమంలో టీకాను వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని గణంకాల మేరకు తెలంగాణలో 79 లక్షల మంది యాభై ఏళ్లకు పైబడిన వారు వున్నారని అంచనా. అయితే ఈ సంఖ్య వాస్తవంలో 85 లక్షలకు చేరువలో వుంటుందని అంచనా. ఇందుకోసం 50 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే శిక్షణ కార్యక్రమం పూర్తికాగా, ఇప్పుడు జిల్లాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రానున్న పదిరోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనూ వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ప్రజారోగ్య విభాగం. ప్రస్తుతం హైదరాబాద్ లోని కోఠి ఆరోగ్య కార్యాలయంలో శిక్షణ ఇస్తున్నారు. టీకా రాష్ట్రానికి చేరుకున్న వెంటనే తొలుత ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి ఇస్తారు. వీరందరికీ ఒకేసారి టీకా ఇవ్వనున్నారు. తొలి విడతలో దాదాపు 79 లక్షల మందికి టీకా ఇవ్వనుండగా, వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది దాదాపు 3 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. మరో రెండు లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా సిబ్బంది ఉంటారు. మిగతా వారంతా 50 ఏళ్ల వయసు పైబడినవారేనని తెలుస్తోంది. అలాగే, 50 ఏళ్ల లోపు వయసు ఉండి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా టీకా ఇవ్వనున్నారు.

అయితే కేంద్రం నుంచి తమకు తొలి విడతగా కోటి 60లక్షల వ్యాక్సీన్ డోసులు అందనున్నట్లు సమాచారం. దీంతో ఈ మొత్తం డోసులను ఒక్క పర్యాయంలోనే ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రజారోగ్యం విభాగం కసరత్తు చేస్తోంది. అందుకోసం ఇప్పటికే ఈ మొత్తం డోసులను సురక్షితంగా నిల్వ చేసే ప్రదేశంతో పాటు వాటిని అందించేందుకు కూడా ఏర్పాటు చేశామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 వేల బృందాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఒక్కో బృందం ఒక్కో కేంద్రంలో టీకాలు వేస్తుంది. ఇందుకోసం పదివేల మంది ఏఎన్ఎంలు, 25 వేల మంది ఆశా కార్యకర్తలు, 15 వేల మంది వైద్యులు, నర్సులకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, రాష్ట్ర స్థాయిలో రెండు కోట్లు, జిల్లా స్థాయిలో కోటి టీకాలను ఒకేసారి భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles