KCR announces sops ahead of GHMC polls రాజధాని ప్రజలపై సీఎం వరాల జల్లు..

Kcr announces sops ahead of ghmc polls waives off water power charges

TRS, CM KCR, GHMC Elections, Minister KTR, KT RamaRao, TRS Government, KCR announces sops ahead of GHMC polls, KCR waives off water bill, KCR wavies off bill, Saloons, laundries, Thames river, Godavari river, TRS Manifesto, Hyderabad, Telangana, Politics

Telangana CM K Chandrasekhar Rao said water bills for usage up to 20,000 litres in households within the Greater Hyderabad Municipal Corporation limits will not have to be paid, ahead of civic polls due on Dec 1. He also waived off power charges for hair cutting saloons and laundries, while launching the Telangana Rashtra Samithi's manifesto.

జీహెచ్ఎంసీ ఎన్నికలు: హైదరాబాదీలకు సీఎం కేసీఆర్ వరాల జల్లు..

Posted: 11/23/2020 11:16 PM IST
Kcr announces sops ahead of ghmc polls waives off water power charges

(Image source from: Twitter.com/trspartyonline)

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ.. హైదరాబాదీవాసులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాజధాని వాసులపై వరాల జల్లు కురిపించారు. నగరవాసులకు పురపాలక సంస్థ నుంచి అందించే తాగునీటిని ఉచితంగానే అందిస్తున్నట్లు చెప్పారు, డిసెంబర్ నెల నుంచే ఇది అమల్లోకి వస్తుందని అన్నారు, దీంతో ఇక వచ్చే నెల నుంచి నగరవాసులు చెల్లించే వాటర్ బిల్లులకు చెక్ పడింది. నగరంలోని 98 శాతం మంది ప్రజలకు 20 వేల లీటర్ల నీటిని తమ ప్రభుత్వం ఇకపై ఉచితంగానే సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అంతేకాదు ఈ ఉచిత తాగునీటి పథకాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని అన్నారు.

నగరంలోని అన్ని సెలూన్ షాపులు, లాండ్రీ దుకాణదారులకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగరవాసులపై ఈ వరాలను కురిపించారు, ఇక మరోవైపు సినిమా ధియేటర్లను తెరిచేందుకు కూడా అనుమతులు ఇస్తూ జీవోను విడుదల చేసిన సీఎం కేసీఆర్.. సినీమా హాళ్లు పుంజుకునేంత వరకు వారికి కూడా ఉచిత విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. అదే మాదిరిగా నగరంలోని వ్యాపారులు, దుకాణాదారులు కూడా విద్యుత్ నుంచి మినహాయింపు కల్పించనున్నామని కేసీఆర్ ప్రకటించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ధోబీఘాట్లను రిపేర్ చేస్తామని చెప్పారు. ధోబీఘాట్లకు వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో మోటార్ వాహనాల పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించి వానహదారులపై కూడా వరాలను కురిపించారు. త్వరలోనే సమగ్ర జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. అధికారుల్లో బాధ్యతను పెంచేలా కొత్త చట్టానికి రూపకల్పన చేస్తామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఎన్నో హైదరాబాదుకు తరలి వస్తున్నాయని తెలిపారు. జంట నగరాల్లో ఇప్పుడు నీటి కొరత లేదని చెప్పారు. పుష్కలంగా మంచి నీటి సరఫరా జరుగుతోందని కేసీఆర్ చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles