Revanth Reddy alleges TRS Govt on ponds Encroachments రాష్ట్ర మంత్రి వియ్యంకుడిపై రేవంత్ రెడ్డి సంచలన అరోపణలు

Mp revanth reddy alleges trs minister close relative behind illegal gutka business

Revanth Reddy, Congress, Gutkha business, minister relative in illegal business, TRS, CM KCR, ponds, ponds encrochments, Malla Reddy, GHMC Elections, Minister KTR, KT RamaRao, TRS Government, Malkajgiri MP, Hyderabad, Telangana, Politics

Congress party Senior Leader and Malkajgiri MP Revanth Reddy made sensationa allegations on High Court banned Gutkha business illegal run in the state with the support of TRS Minister. He alleges that TRS Minister close relative is Runnig the business with govt support.

రాష్ట్ర మంత్రి వియ్యంకుడిపై రేవంత్ రెడ్డి సంచలన అరోపణలు

Posted: 11/23/2020 10:48 PM IST
Mp revanth reddy alleges trs minister close relative behind illegal gutka business

గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలికి జరుగుతున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిషాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపి, ఎంఐఎం పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండగా, ఇక తాజాగా కాంగ్రెస్ కూడా ఎన్నికల సమరక్షేత్రంలోకి దిగి ప్రత్యర్థి పార్టీలకు దీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి సంచలన అరోపణలు చేశారు. హైకోర్టు అదేశాలతో నిషేధానికి గురైన గుట్కా వ్యాపారాన్ని.. టీఆర్ఎస్ ప్రభుత్వంలోని అమాత్యుడి వియ్యంకుడు గుట్టుగా సాగిస్తున్నాడని అరోపించారు. ఈ విషయం పార్టీముఖ్యులకు, ప్రభుత్వవర్గాలకు తెలిసినా.. వారి అండతోనే రాష్ట్రంలో అడ్డుఅదుపు లేకుండా నడుస్తోందని ఆయన అరోపించారు.

హైదరాబాద్ నగర ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అంతర్జాతీయ స్టేటస్ కలిగిన నగరంగా ప్రచారం చేసుకుని మాయమాటలతో మభ్యపెట్టడం మినహాయించి ఏ అభివృద్ది చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు, ఔటర్ రింగ్ రోడ్డును వేల కోట్ల ఖర్చుతో నిర్మించినట్టు టీఆర్ఎస్ వాళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ ఔటర్ రింగ్ రోడ్డు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ, ఐటీ సంస్థలు, మెట్రో రైలు, గోదావరి, కృష్ణా జలాలు, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ ప్రెస్ వే సహా అన్ని అభివృద్ది పనులు గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వచ్చినవేనని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేసి.. ప్రారంభోత్సవాలు చేయడం తప్ప టీఆర్ఎస్ సర్కారు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

రెండు దశాబ్దాలలో లేని వర్షం కురవడంతోనే హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయాని చెబుతూ పరిహారాంగా ఇస్తున్న పదివేల రూపాయలను ఆపించిన ఘనత కూడా అదే ప్రభుత్వం దొడ్డిదారిన చేసిందని రేవంత్ అన్నారు. నగరంలోని అనేక చెరువులను, పార్కులను టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని కాంగ్రెస్ ఆయన ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అనుచరులు వందల చెరువులను కబ్జా చేశారని, అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. కరోనా కాలంలో కూడా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మాత్రమే పుంజుకుందని వార్తలు రావడానికి కూడా కేటీఆర్ మిత్రుల పుణ్యమేనని అన్నారు, కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి అయ్యాక నాలాలు కబ్జాలకు గురై మురికి కాలువలను తలపిస్తున్నాయని అరోపించారు.

వందేళ్లలో తెలంగాణలో జరగని ఆక్రమణలు సీఎంగా కేసీఆర్ హాయంలోని గత ఏడేళ్ల కాలంలోనే జరిగాయని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ మంత్రులు కూడా కేటీఆర్ బాటలోనే పయనించి చెరువులు, కుంటలను మింగేస్తున్నారని దుయ్యబట్టారు, మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీలు చెరువుల్లోనే నిర్మించారని ఆరోపించారు. అవాస్తవాలను ప్రచారంచేస్తూ టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాలున్న పుస్తకం టీఆర్ఎస్ ప్రగతి నివేదిక అని ఎద్దేవాచేశారు. ఇప్పటివరకు  సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ నిజాయతీగా ఒక్క నిజం అయినా చెబుతారేమోనని చూశానని, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడే పరిస్థితి కనిపించడంలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh