BJP MP Aravind Removes TRS Hoarding టీఆర్ఎస్ హోర్డింగును తొలగింపజేసిన బీజేపి ఎంపీ

Bjp mp fires on kcr and ktr removes trs hoarding from public toilet

KCR, KTR, Telangana, BJP, Dharmapuri Aravind, Dharmapuri Aravind news, Dharmapuri Aravind updates, Dharmapuri Aravind latest, Dharmapuri Aravind flexy, Dharmapuri Aravind about KCR, Dharmapuri Aravind about KTR, Dharmapuri Aravind latest news, Dharmapuri Aravind breaking news, Dharmapuri Aravind video, Dharmapuri Aravind about GHMC polls, BJP MP Aravind Fires on KCR and KTR, TRS, CM KCR, GHMC Elections, Minister KTR, KT RamaRao, TRS Government, KCR waives off water bill, KCR wavies off bill, Saloons, laundries, Thames river, Godavari river, TRS Manifesto, Hyderabad, Telangana, Politics

BJP MP Dharmapuri Aravind staged an attack on TRS government and he made shocking comments on KCR and KTR several times in the past. Stepping ahead, he stepped out of his car after he observed a flexy of KCR and KTR on a public toilet in the city. His aides tore the flexy on the spot after which Aravind slammed KTR and his son KTR.

టీఆర్ఎస్ ప్రచార హోర్డింగును దగ్గరుండీ తొలగింపజేసిన ధర్మపురి అరవింద్

Posted: 11/23/2020 11:47 PM IST
Bjp mp fires on kcr and ktr removes trs hoarding from public toilet

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, పబ్లిక్ టాయిలెట్లు ఇత్యాది ప్రభుత్వ స్థలాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంపై నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పారదర్శక పాలన సాగిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. నీ హయాంలో ప్రచర హోర్డింగుల విషయంలో పారదర్శకత ఎక్కడకి వెళ్లిందని ప్రశ్నించారు, మాటల్లో పారదర్శకత పదే పదే తుళ్లి పడుతుందని కానీ పాలనలో మాత్రం అదృశ్యమవుతోందని ధ్వజమెత్తారు. పబ్లిక్ టాయిలెట్స్ పై వున్న టీఆర్ఎష్ ప్రచార హోర్డింగ్ ను దగ్గరుండి మరీ తోలగింపజేసిన ఆయన ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శేరిలింగంపల్లిలోని పలు కార్రోరేటర్ వార్డుల పరిధిలో ప్రచారాన్ని నిర్వహించిన ఆయనకు ఓ ప్రాంతంలో పబ్లిక్‌ టాయిలెట్స్ పై ఉన్న టీఆర్ఎస్‌ ప్రచార హొర్డింగ్ ను చూసి దానిని తోలగింపజేసిన తరువాత ఆయన మాట్టాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాత్రికి రాత్రి ఇన్ని చోట్ల మీకు హోర్డింగులు పెట్టుకునేందుకు ఎలా అనుమతులు లభించాయని ఆయన ప్రశ్నించారు. ప్రైవేట్‌ ఏజెన్సీలతో అధికార పార్టీ కుమ్మక్కయిదంటూ ఆరోపించారు. బస్టాండులు, పబ్లిక్ టాయిలెట్లు మెట్రో పిల్లర్లుపై ప్రచారహోర్డింగుల కోసం నోటిఫికేషన్ తీసుకువచ్చే ముందుగానే వారితో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని అరోపించారు.

ప్రైవేటు ఏజెన్సీలకు ప్రచార హోర్డింగుల నిర్వహణను అందించామని చెప్పి తప్పించుకుంటున్న ప్రభుత్వం.. ప్రైవేటు ఏజెన్సీలకు టీఆర్ఎస్ పార్టీ మాత్రమే డబ్బులిచ్చే పార్టీగా కనిపిస్తోందా.? మిగతా రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి ప్రచారాన్ని నిర్వహించవా.? అని ఆయన ప్రశ్నించారు. ప్రైవేటు ఏజెన్సీలు ప్రచార హోర్డింగులు కోసం ఎందుకు టెండర్లును అహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు, టీఆర్ఎస్ కోట్ చేసే దానికన్న అత్యధికంగా తాము టెండర్లను చేజించుకునేవారిమని అన్నారు. ప్రైవేటు ఏజెన్సీలైనా ప్రభుత్వ ఆస్తులపై ప్రచారాలను నిర్వహించుకునే సందర్భంలో తప్పక పారదర్శకత పాటించాలని అరవింగ్ అన్నారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషర్‌ యాక్షన్‌ తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles