Bridge washed away in Kishanganj ahead of inauguration ప్రారంభోత్సవానికి ముందే కట్టుకుపోయిన బ్రిడ్జి..

Newly constructed bridge collapses ahead of inauguration in bihars kishanganj

Bihar bridge collapse, bridge collapses, Kishanganj, Bihar bridge, Nitish Kumar, Bihar Chief Minister, Kanakai river, flood situation, National, politics

A newly constructed bridge has washed away ahead of its inauguration in Bihar's Kishanganj following a rise in the water level of Kankai river. The bridge was built at a cost of Rs 1.42 crore. The incident took place in Goabari village on Thursday.

ప్రారంభోత్సవానికి ముందే కట్టుకుపోయిన బ్రిడ్జి..

Posted: 09/18/2020 07:02 PM IST
Newly constructed bridge collapses ahead of inauguration in bihars kishanganj

పాలకులు నిర్లక్ష్యం.. అధికారులు పర్యవేక్షణా లోపం.. కాంట్రాక్టర్ల ధనదాహం వెరసి ప్రజాధనం నీటమునిగింది. మరోలా చెప్పాలంటే నీటి వరదలో కొట్టుకుపోయింది. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా నదిపై నిర్మించిన బ్రిడ్జి మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్దమవుతుండగా పరిసర గ్రామాల ప్రజల ఆశలను అడియాశలు చేస్తూ కోట్టుకుపోయింది. ఇక త్వరలోనే తమకు కష్టాలు దూరమవుతున్నాయని భావిస్తున్న ఆయా గ్రామాల ప్రజలను మరిన్ని కష్టాల్లోకి నెట్టేలా వుందీ ఘటన. దేశంలో.. రాష్ట్రంలో అవినీతికి అడ్రస్ లేకుండా చేస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వాల ప్రసంగాలకు సవాల్ విసిరేలా జరిగిందీ ఘటన.

బీహార్ లోని కిషన్ గంజ్ లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందుగానే కొట్టుకుపోయింది. కింన్కాయీ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన నీటి ఒత్తిడి కారణంగా కూలిపోయిందని తెలుస్తోంది. అయితే నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన కొట్టుకుపోవడం నాణ్యత లోపం కారణంగానే జరిగిందని అక్కడి ప్రజలు అరోపిస్తున్నారు. స్థానికి గోవాబారీ గ్రామంలో కింన్కాయీ నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పూర్తై త్వరలో ప్రారంభానికి కూడా సిద్దమైంది. అయితే ఈ వంతెనకు రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. ఈ పనులు పూర్తికాగానే ఈ వంతెన ప్రారంభానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది.

అకస్మాత్తుగా ఈ వంతెన కూలిపోవడంతో స్థానికులు నివ్వెరపోయారు. నూతనంగా నిర్మిస్తున్న ఈ వంతెన నాణ్యతను తప్పుబడుతున్నారు. ఈ వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టరు, అధికారులను బాధ్యల్ని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ తో ప్రభుత్వం ఈ వంతెన నిర్మించగా అధికారుల అమ్యామ్యాల కారణంగా కాంట్రాక్లర కక్కుర్తి కారణంగా కోటిన్నర నిధులు నీటిలో కొట్టకుపోయాయని అరోపిస్తున్నారు, ఇక ఈ వంతెన కూలిపోవడంతో గ్రామస్తుల కష్టాలు మరింతగా పెరిగాయి. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా కిషన్‌గంజ్‌ పరిధిలోని పలు ప్రాంతాలు వరదల కారణంగా నీట మునిగాయి. దీనికితోడు కన్కాయీ నదిలో నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ కారణంగానే వంతెన కూలివుండవచ్చని భావిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles