Indian Railways to charge user fee at the busy stations రైల్వే ప్రయాణికులపై యూజర్ బాదుడు.. ఆ స్టేషన్లలోనే..

Indian railways trains fares to soon include user charge for stations similar to flight fares

indian railways, railways, redeveloped station, railway board, user fee, VK Yadav, Railway Board Chairman, major railway stations, Piyush Goyal, share market news, Business news, economy news, finance news, business news india, IPO, market news

Indian Railways is planning to introduce 'affordable' user charges in 700-1,050 stations across the country to generate more revenue, while providing better facilities for passengers. This is a massive shift from its initial plan of levying user charges from passengers using 50 modernized stations.

రైల్వే ప్రయాణికులపై యూజర్ బాదుడు.. ఆ స్టేషన్లలోనే..

Posted: 09/18/2020 07:44 PM IST
Indian railways trains fares to soon include user charge for stations similar to flight fares

దేశంలోని పేద ప్రజలు సూదూర గమస్థానాలను చౌకగా చేరుకునే నేపథ్యంలో ప్రారంభమైన భారతీయ రైల్వే.. రాను రాను లాభాల ఆర్జనకే పెద్దపీట వేస్తూ గత ఆర్థిక సంవత్సరం నుంచి ప్రైవేటైజేషన్ బాటన కూడా పయనిస్తోంది. తొలుత రైల్వేశాఖ ఐఆర్సీటీసీ ఆద్వరంలో పలు మార్గాల్లో ప్రైవేటు రైలును నడిపిన శాఖ.. గణనీయంగా లాభాలను అర్జించామని చూపింది. దీంతో పలు మార్గాలలో తాము రైళ్లను నడపుతామని రైల్వే బోర్డు వద్ద బడా సంస్థలు క్యూ కట్టిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం విమానాశ్రయాలను నిర్వహిస్తున్న పలుసంస్ధలు కూడా పలు మార్గాల్లో రైళ్లను నడిపేందుకు పోటీ పడుతున్నాయి.

ఇక తాజాగా పేదల చౌక రవాణా మార్గం రైల్వేలోనూ ధరల పెంపుతూ ఇప్పటికే బారెడు భారం మెపిన కేంద్రం.. తాజాగా వారిపై యూజర్ చార్జీలను కూడా బాదేందుకు సమాయత్తం అయ్యింది. పండగలు, మొదలకు పర్వదినాల సమయాల్లో ఫ్లాట్ ఫాం ధరలను ఏకంగా వంద నుంచి రెండు వందల రెట్లు పెంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అధునాతన సేవల పేరుతో ఇక యూజర్ చార్జీలను వసూలు చేసేందుకు రెడీ అయ్యింది. విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లుగా యూజర్ చార్జీలను వసూలు చేసి స్టేషన్ల పరిశ్రుభత, ప్రయాణికులకు సేవలు నిర్వహించానలి కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది.

రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైలు టికెట్‌ సహా యూజర్‌ చార్జీలు కూడా వసూలు చెయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సంధర్భంగా రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రయాణికులకు సౌకర్యాల కల్పినకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ ఛార్జీలు సాధారణంగానే ఉంటాయన్న ఆయన రైల్వే టికెట్ ధరకు అదనంగా యూజర్ చార్జీలు ఉంటాయని, దీంతో టికెట్ ధరలు పెరగనున్నాయని అన్నారు. అంతేకాకుండా ఒకసారి స్టేషన్‌ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ ఛార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని అన్నారు. దేశంలో ఉన్న 7వేల రైల్వే స్టేషన్లలో 10-15 శాతం అనగా 700 నుంచి 1050 స్టేషన్లలో ఈ చార్జీలను వసూలు చేస్తామని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles