Telangana: Intermediate syllabus cut by 30 per cent ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..

Telangana intermediate syllabus reduced by 30 per cent due to pandemic

tsbie, telangana, inter, telangana inter syllabus, inter syllabus in telangana, coronavirus, covid-19

The Telangana government has reduced the intermediate syllabus by 30 per cent for the academic year 2020-21 due to coronavirus pandemic. Since most of the working days were lost due to the corona outbreak, the government has taken the decision to ease the burden on students.

ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Posted: 09/18/2020 06:31 PM IST
Telangana intermediate syllabus reduced by 30 per cent due to pandemic

తెలంగాణ విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్తను వెలువరించింది. అసలే కరోనా నేపథ్యంలో పాఠశాలలు, విద్యా సంస్థలకు సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇటీవలే ఈ ఏడాది దసరా, సంక్రాంతి సెలవులను కూడా కుదించి మొత్తం మీద కేవలం 182 రోజుల పాటు విద్యా సంవత్సరంలో తరగతులను నిర్వహిస్తుండగా, తాజాగా ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాల్లో 30 శాతం పాఠ్యాంశాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు చేససిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది.

ఈ ఏడాది ఏకంగా 40 రోజుల పాటు విద్యార్థులు తరగతులను మిస్ అయ్యారు, దీంతో పాఠ్యాంశాలను తగ్గింపుతో అటు విద్యార్థులపై, ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించింది. కరోనా నేపథ్యంలో నష్టపోయిన పనిరోజులకు అనుగుణంగా ఈ పాఠ్యాంశాలను తగ్గించనున్నారు. సీబీఎస్‌ఈ మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులల్లో విధించిన కోతకు అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్ లో కోత విధించనున్నారు. జేఈఈ మెయిన్, నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రాధాన్యం తక్కువగా ఉన్న పాఠాలను తొలగించనున్నారు.

సర్వసాధరణాంగా రెండు వందలకు పైగా వుండూ పనిదినాలు ఈ ఏడాది మాత్రం తగ్గిపోయాయి. గత ఏడాది 222 పనిదినాలు.. ఈ ఏడాది 40 రోజులు తగ్గించి, 182 రోజులుగా పరిమితం చేశారు. తొలిగించిన పాఠ్యాంశాల వివరాలకు సంబంధించి త్వరలోనే ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించనుంది. ఇదిలా ఉంటే మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించి, పలు కారణాలతో పరీక్షలు రాయని 27వేల మంది విద్యార్థులను కూడా పాస్ చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tsbie  telangana  inter  telangana inter syllabus  inter syllabus in telangana  coronavirus  covid-19  

Other Articles