Indian warship in South China Sea after Galwan clash భారత యుద్ద నౌక ఆగమనంతో చైనా కలవర పాటు..

Indian navy sent warship to south china sea after ladakh clash report

Indian Navy, South China Sea, Indian Navy, China, Indian warship, Galwan Valley, Chinese Navy, security establishment, American counterparts

The deployment of the Indian Navy warship in the South China Sea had a desired effect on the Chinese Navy and security establishment as they complained to the Indian side during diplomatic level talks, sources told

భారత యుద్ద నౌక ఆగమనంతో చైనా కలవర పాటు..

Posted: 08/31/2020 11:23 PM IST
Indian navy sent warship to south china sea after ladakh clash report

తూర్పు లడ్డాఖ్ లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న తన బలగాలపై దాడికి దిగిన చైనాకు విస్పష్ట హెచ్చరిక చేసేందుకు భారత్‌ అనూహ్య చర్యను చేపట్టింది. మెరుపు వేగంతో స్పందిస్తూ.. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపింది. ఇది డ్రాగన్ కు కలవరం పుట్టించింది. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, ఆపై మొదలైన వాణిజ్య యుద్ధం తరువాత, ఇండియా మరో కీలక అడుగు వేసింది. దక్షిణ చైనా సముద్రంలోకి తన యుద్ధ నౌకను పంపింది. చైనా అధికారులతో ఇండియా జరుపుతున్న ద్వైపాక్షిక చర్చలు ఎటూ తేలకపోవడం, చర్చలు ఫలవంతం కాకుంటే తదుపరి నిర్ణయాలు వేరేలా ఉంటాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో, మన యుద్ధనౌక చైనా సముద్రంలోకి వెళ్లడం కలకలం రేపుతోంది. జూన్ లో తూర్పు లడఖ్, గాల్వాన్ లోయలో జరిగిన పరిణామాల తరువాత భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకోగా, ఇండియన్ వార్ షిప్ లు తమ పరిధిలోకి రావడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2009 తరువాత దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలను సృష్టించిన చైనా, తన సైనిక అవసరాలను అక్కడి నుంచి తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించిన తరువాత, కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భారత నౌకాదళం, తన వార్ షిప్ ను దక్షిణ చైనా సముద్రంలోకి పంపింది.

దక్షిణ చైనా సముద్రంలోని అత్యధిక భాగం తన పరిధిలోనికే వస్తుందని వాదిస్తున్న చైనా లిబరేషన్ ఆర్మీ అక్కడ మరొకరి ఉనికిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా తన వార్ షిప్ లను మోహరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ యూఎస్, ఇండియాలు కలిసి నావికా దళ విన్యాసాలను సైతం ప్రారంభించాయి. భారత వార్ షిప్, అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని మలక్కా జలసంధి సమీపంలో మోహరించింది. ఈ సముద్ర జలాలు తమ పరిధిలోనివేనని అంటున్న ఇండియా, ఇదే ప్రాంతానికి జలాంతర్గాములను సైతం పంపాలని నిర్ణయించిందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కాగా, భారత వార్ షిప్ సౌత్ చైనా సీ పరిధిలోకి రావడాన్ని ఖండిస్తున్నామంటూనే, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా అధికారి ఒకరు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles