Celebs mourn loss of former President Pranab Mukherjee ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ప్రముఖుల దిగ్ర్భాంతి

President kovind condoles pranab mukherjees demise says combined tradition modernity

pranab mukherjee death,Breaking news pranab mukherjee death,Pranab Mukherjee news,Pranab Mukherjee, Covid-19 positive,Former President Pranab Mukherjee death, Pranab Mukherjee,pranab mukherjee biography, what happened to pranab mukherjee,present president of india, pranab mukherjee twitter, Pranab Mukherjee, Death, Ramnath Kovind, President, Venkaiah naidu, vice-president, PM Modi, Rahul Gandhi, Delhi

Condoling the death of his predecessor Pranab Mukherjee, President Ram Nath Kovind observed that an era had passed away. Terming him as a 'colossus in public life', the President stated that Mukherjee served India with the spirit of a sage.

భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ప్రముఖుల దిగ్ర్భాంతి

Posted: 08/31/2020 11:42 PM IST
President kovind condoles pranab mukherjees demise says combined tradition modernity

భరత మాత ముద్దుబిడ్డ, అపర చాణక్యుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూయడం పట్ల దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఎనబై నాలుగేళ్ల రాజకీయ కోవిదుడిని దేశం కోల్పోయిందని అన్నారు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, విపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ప్రజల్లో వున్న ఆజానుభావుడని, తన పనితీరుతో నిలువెత్తు విగ్రహంగా ఎదిగారని అన్నారు. ఆయన మరణంతో ఓ శకం ముగిసిపోయిందన్నారు. దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందని అవేదన వ్యక్తం చేశారు. ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్ ను ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనదని పేర్కోన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భారత రత్న ప్రణబ్‌ ముఖర్జీ మరణ వార్త విని దేశం మొత్తం విలపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశ అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. ఆయనో గొప్ప రాజనీతిజ్ఞుడని.. అటు రాజకీయ వర్గాల్లోనే కాక, సామాన్యుల నుంచి సైతం మెప్పు పొందిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు ప్రధాని.

మాజీరాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. ఎంతో శ్రమ, పట్టుదల, క్రమశిక్షణతో దేశ రాజ్యాంగ అత్యున్నత పదవిని చేపట్టారని.. ప్రజా సేవలో భాగంగా ఆయన చేపట్టిన అన్ని పదవులకూ వన్నె తెచ్చారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

ప్రణబ్‌ ముఖర్జీ మాతృభూమికి ఎనలేని సేవలు అందించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రణబ్‌ మృతితో దేశం పెద్ద రాజకీయ నేతను కోల్పోయిందని అన్నారు.

ప్రణబ్‌జీ మరణవార్తతో దేశం మొత్తం దుఖః సాగరంలో మునిగిపోయిందని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. యావత్‌ దేశంతో పాటు తాను కూడా ప్రణబ్ ముఖర్జీకి శ్రద్ధాంజలి ఘటిస్తెున్నానని ఆయన అంజలి ఘటించారు. దేశం గొప్ప రాజనీతిజ్ఞడను కోల్పోయిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్. తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ఎంతో అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి ప్రణబ్‌ నాయకత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. యాదాద్రి దేవాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారు. వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్‌కు నివాళులు అర్పిస్తున్నానన్నారు కేసీఆర్.

ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశం ఓ గోప్ప రాజకీయ కోవిదుడ్ని కోల్పోయిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు, ఆయన తన జీవితంలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించారు. క్లిష్ట సమస్యల పరిష్కారంలో ప్రణబ్‌ పరిణతి ప్రదర్శించారు. రాజకీయ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లారని వైఎస్‌ జగన్‌ అన్నారు.

భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ మనల్ని వీడి వెళ్లిపోవడం తీరని లోటని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆయన మరణం తమ రాష్ట్రంలో దు:ఖాన్ని నింపిందని అన్నారు. ఒక శకం ముగిసింది. తాను తొలిసారి ఎంపీగా గెలుపొందినప్పుడు ఆయన సీనియర్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తాను సీఎంగా ఉన్నా. ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. ప్రణబ్‌ దాదాలేని ఢిల్లీ పర్యటన ఊహించుకోలేకపోతున్నానని అన్నారు. రాజకీయాల నుంచి ఆర్థికశాస్త్రం దాకా అన్ని అంశాల్లో ఆయనొక లెజెండ్‌.  అభిజిత్‌, శర్మిష్ఠకు అమె తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాకలు తీరిన రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలిని దేశం కోల్పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికి లోటు. 60 ఏళ్ల రాజకీయాల్లో ప్రణబ్‌ ముఖర్జీ వివాదరహితుడన్నారు. ప్రణబ్‌ నిరాడంబరత, నిబద్ధత, నిజాయతీ అందరికీ ఆదర్శప్రాయమని చంద్రబాబు అన్నారు. ప్రణబ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన ఆయన మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుబూతి తెలియజేశారు పవన్. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ప్రవేశించిన ప్రణబ్‌ ముఖర్జీ విలక్షణమైన ధ్రువతారగా వెలిగారు. రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగినా తన మూలాలను మరచిపోని ఆయనలోని విలక్షణత తనన్నెంతో ఆకట్టుకుందన్నారు. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయం. అనుసరణీయం అని అన్నారు పవన్ కల్యాణ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranab Mukherjee  Death  Ramnath Kovind  President  Venkaiah naidu  vice-president  PM Modi  Rahul Gandhi  Delhi  

Other Articles