Digital classes for govt school students postponed తెలంగాణ ఇంటర్ విద్యార్థుల డిజిటల్ తరుగతులు వాయిదా

Digital classes not to begin this month for government school students

digital classes, government schools, government collages, Union Government, Government school students, High Court, Telangana HC, intermediate students, department of education, heavy rain, Doordarshan, T-SAT, Sabitha Indra Reddy, government teachers, Telangana

The department of education, Telangana announced that the digital classes for the govenment school students had been postponed as they have not recieved the permission from the centre, Moreover a case is pending for hearing in the state High Court which will be heard on 27th of this month.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల డిజిటల్ తరుగతులు వాయిదా

Posted: 08/20/2020 09:28 PM IST
Digital classes not to begin this month for government school students

కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. చిన్నారులకు చదువు కన్నా ఫ్రాణాలే మిన్న అని ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి, కాగా, ఇటీవల జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు ఆధారంగా.. ముప్పు పొంచి వున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగాల్సిందేనని ప్రభుత్వాలు కూడా సిద్దమయ్యాయి. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించాయి. కరోనా వైరస్ రికవరీ రేటు అధికంగా వుంటున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు పూనుకుంటున్నాయి,

ఇందులో బాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్తులకు డిజిటర్ తరగతులను నిర్వహించాలని పూనుకుంది. అయితే చివరి నిమిషంలో ఈ డిజిటల్ తరగతుల నిర్వహణను వాయిదా వేసింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఈ నెల 20 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని చెబుతున్నా.. ఈ నెలాఖరు వరకు పాఠాలు ప్రసారం కావని సమాచారం, ఇందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వమే అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఇవాళ కూడా పాఠాలు ప్రసారం కాలేదు. అయితే తరగతుల ప్రసారానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా పచ్చజెండా ఊపలేదని, అందువల్లే కొంత ఆలస్యం జరుగుతోందన్న వార్తులు వినిపిస్తున్నాయి,

ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలు తెరవడంపై కేంద్రం నిషేధం ఉండటం, హైకోర్టులో కేసు ఈ నెల 27న మళ్లీ విచారణకు రానుండటం తదితర కారణాలతో ప్రభుత్వం డిజిటల్‌ పాఠాలకు పచ్చజెండా ఊపలేదని చెబుతున్నారు. కాగా న్యాయస్థానం ఆన్‌లైన్‌ పాఠాలు వద్దని అనలేదని, ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతి ఇచ్చారా? లేదా? అన్నదే ప్రశ్నించిందని నిపుణులు అంటున్నారు. విద్యా సంస్థలు తెరవడంపై నిషేధం ఉన్నా ఎవరి ఇంట్లో వారు ఉంటూ పాఠాలు వినడానికి ఇబ్బంది ఏముందని ప్రశ్నించారు. అయితే కొందరి విద్యార్థుల ఇళ్లలో టీవీలు లేవని, అలాంటి ఇళ్లలోని పిల్లలు పాఠాలు వినాలంటే ఎక్కడికి వెళ్లాలనే సమస్య వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles