Ready to let people die for economy Uddhav Thackeray దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి: ఉద్ధవ్ థాకరే సవాల్

What if people die cm uddhav thackeray warns against lifting lockdown

Uddhav Thackeray, lockdown, Maharashtra, Coronavirus, Shiv sena, congress, NCP, BJP, Defections, challenge, State Economy, Public Health, Maharashtra coronavirus updates, Tamil Nadu

Maharashtra chief minister Uddhav Thackeray strongly backed and justified his decision to not rush in to lift restrictions that are put in place to contain the spread of coronavirus disease (Covid-19), adding would those demanding lifting of the lockdown take responsibility for the fatalities.

దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి: ఉద్ధవ్ థాకరే సవాల్

Posted: 07/25/2020 04:53 PM IST
What if people die cm uddhav thackeray warns against lifting lockdown

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ.. పలు రాష్ట్రాల్లో అధికారంలో వున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలను కూలదోసి.. ఫిరాయింపులకు ఉసిగోల్పుతూ తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తొందని ఈ తరుణంలో దమ్ముంటే మహారాష్ట్రలోని తమ ప్రభుత్వాన్ని కూల్చాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. బీజేపీతో తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని, తమ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది.

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూలిపోవడం, రాజస్థాన్‌లో అస్థిరతపై ఆయన స్పందిస్తూ... పై వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలసి రాష్ట్ర పరిస్థితులపై అద్యయనం చేసిన తరువాత ఇక తదుపరి టార్గెట్ మహారాష్ట్రే అని వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో ఉద్దవ్ థాకరే వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంబంధాలపై కేంద్ర ప్రభుత్వానికి ఓ క్లారిటీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ రోజు మనం చైనాను వ్యతిరేకిస్తున్నాం. కానీ... రాబోయే రోజుల్లో చైనా- భారత్ మిత్ర దేశాలుగా మారొచ్చు. అంతర్జాతీయ సంబంధాలపై మనం మరింత కష్టపడాల్సి ఉంటుంది. మరింత స్పష్టత రావాల్సి ఉంది’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి విజృంబిస్తూ దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో జడలు విప్పుతూ ప్రభావానికి గురిచేస్తున్న క్రమంలో ప్రజారోగ్యానికే తాము పెద్ద పీట వేస్తామే తప్ప.. ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్‌ ఎత్తేసేందుకు తాను సుముఖంగా లేనని ఉద్దవ్‌ థకరే తేల్చిచెప్పాన్నారు. మహమ్మారి కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థల మధ్య సమతూకం సాధించడం అవసరమని పేర్కొన్నారు.

‘పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తానని నేనెప్పుడూ అనలేదు. కొద్దికొద్దిగా తెరుద్దామని చెప్పాను. ఒకసారి తెరిచాక మళ్లీ మూసేయొద్దన్నది నా ఉద్దేశం. దశలవారీగా వ్యాపారాలను తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాను. ఆర్థిక వ్యవస్థా, ఆరోగ్యమా అని ఆలోచించకూడదు. రెండింటి మధ్య సమతూకం అవసరం. ఈ మహమ్మారి ప్రపంచ యుద్ధంలాంటిది. అన్ని దేశాలూ దీని బారిన పడ్డాయి. వైరస్‌ ప్రభావం పోయిందని ఆర్థిక వ్యవస్థలు తెరిచిన దేశాలు ఇప్పుడు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో సైన్యాన్ని రంగంలోకి దించారు’ అని ఉద్దవ్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uddhav Thackeray  lockdown  Shiv Sena  Coronavirus  BJP  Defections  challenge  State Economy  Public Health  Maharashtra  

Other Articles

Today on Telugu Wishesh