Covid-19 vaccine trials begin at NIMS నిమ్స్ లో కోవాగ్జిన్ పై క్లినికల్ ట్రయల్స్ షురూ

Human clinical trials for covaxin begins at hyderabad nims

covaxin human trial, corona vaccine,Nizam Institute of Medical Sciences, COVID-19 vaccine, NIMS, Bharat biotech

The Phase-1 Human Clinical Trials for Covaxin, vaccine candidate from India for COVID-19, has started at Nizam's Institute of Medical Sciences (NIMS) here on Monday morning. Two healthy volunteers were administered first dose of the vaccine candidate.

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పై నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ షురూ

Posted: 07/20/2020 09:34 PM IST
Human clinical trials for covaxin begins at hyderabad nims

భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కరోనా వ్యాక్సీన్‌ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌ లోని నిమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో ఇవాళ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. కోవాగ్జిన్ మొదటి, రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ కు భారత డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ (డీసీజీఐ) అనుమతులు జారీ చేసిన నేపథ్యంలో మనుషులపై ట్రయల్స్ కోనసాగుతున్నాయి. ఏకంగా 1155 మంది హ్యూమన్ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్‌ డోస్‌ ఇచ్చారు. పరిపూర్ణ అరోగ్యవంతులైన ఇద్దరితోనే భారత్ బయోటెక్ కోవిడ్ వాక్సీన్ కోవాగ్జిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్)తో పాటు పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ లోని భారత్‌ బయోటెక్ కు చెందిన బయోసేఫ్టీ లెవెల్‌ 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. నిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు వాలంటీర్లకు కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసులు ఇచ్చినట్లు క్లినికల్‌ ట్రయల్స్‌ బృందం సభ్యుడు.. డాక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన ‘కోవాగ్జిన్‌’ వ్యాక్సిన్ ను ఇద్దరు వాలంటీర్లకు ఇవ్వగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు తమ ప్రయత్నం కొనసాగిస్తామన్నారు. తమ వాక్సీన్ కు ఐదు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ఉంటాయన్నారు. నిమ్స్ లో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇతర దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పటికే మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తయ్యాయి. రష్యా, చైనా, యూకె, లండన్లో సెప్టెంబర్‌ వరకు ట్రయల్స్‌ పూర్తవుతాయి. అయితే అక్టోబర్‌ నాటికి కరోనా వ్యాక్సిన్‌ తీసుకొస్తామని భారత్‌ బయోటెక్‌ ప్రకటించిందని శ్రీనివాస్‌ తెలిపారు. ఇప్పటికే జంతుజీవాలపై విజయవంతంగా పనిచేసిన ఈ వాక్సీన్.. ఇవాళ మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించింది. దీంతో ఈ వాక్సీన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోవాగ్జిన్ మనుషులపై కూడా విజయవంతం కావాలని.. కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి తరమివేయాలని కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covaxin human trial  corona vaccine  COVID-19 vaccine  NIMS  Bharat biotech  

Other Articles