HC warns government over corona bulliten తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు

High court warns telangana government over corona bulliten

coronavirus, High Court, Warning, corona bulliten, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The Telangana High Court expressed displeasure over the state government's failure to implement its orders on the COVID-19 outbreak and bulletins. The Court directed the state chief secretary and principal secretaries of the medical, health and municipal administration departments to appear before it on July 28.

తీవ్ర చర్యలు తప్పవు.. తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు

Posted: 07/20/2020 09:14 PM IST
High court warns telangana government over corona bulliten

తెలంగాణ ప్రభుత్వంపై మరోమారు అక్షింతలు వేసింది రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు. ఇదే చివరి అవకాశమని ఇప్పటికైనా మార్పులు, చేర్పులు లేకుండా అసంపూర్తి వివరాలతో ముందుకెళితే తీవ్ర చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. కరోనా బులిటెన్‌ విడుదల విషయంలో న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలను అమలు పర్చాలని అదేశించింది. అందుకు ఇదే చివరి అవకాశంగా భావించాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్రోన్నత న్యాయస్థానం ఇవాళ విచారించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వానికి న్యాయస్థానం అల్టిమేటం జారీచేసింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.

కరోనా బులెటిన్ విడుదల విషయంలో కోర్టు జారీ చేసిన అదేశాలను ఉల్లఘనకు పాల్పడి న్యాయస్థానం సహనాన్ని పరీక్షించవద్దని చెప్పింది. ఈ విషయంలో తప్పక చర్యలు తీసుకోవాలని ఇదివరకే అదేశించిన న్యాయస్థానం తమ అదేశాలు అమలు చేయడంలో జాప్యానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఈ నెల 28న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులను న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కరోనావైరస్ నేపథ్యంలో ప్రభుత్వ అరోగ్యశాఖ ప్రతిరోజు విడుదల చేస్తున్న బులిటెన్ లో సమగ్ర వివరాలు ఉండేలా చూడాలని సూచించింది.

కలెక్టర్లు జిల్లాల వారీగా కరోనా కేసులు, ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలు, రాపిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారనే విషయాలను వెల్లడించాలని సూచించింది. వైద్యారోగ్యశాఖ వెబ్ సైట్ ను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబరును విస్తృత ప్రచారం చేయాలి. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలి. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలి. కరోనా నియంత్రణ ప్రభుత్వం, అధికారుల రాజ్యాంగ బద్ధమైన విధి. దానిని విస్మరించరాదు’’ అని కోర్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles