ysrcp leader joni kumari suicide attempt వైసీపీ మోసం భరించలేక విషం తాగిన మహిళా నేత

Ysrcp leader joni kumari suicide attempt during press meet

joni kumari, suicide attempt, poison, mala mahanadu president, press meet, CM YS Jagan, Vijay Sai Reddy, YSRCP, vijayawada, Andhra pradesh, politics

Andhra Pradesh police rushed to the spot, where YSRCP Mala Mahanadu president Joni Kumari attempted suicide during press meet and took her to Hospital, She allegedly says that, had been cheated by the party after making promises to her. Justice is not done to her even after meeting the top party leader and MP vijaya sai reddy.

వైసీపీ మోసం భరించలేక విషం తాగిన మహిళా నేత

Posted: 07/20/2020 09:56 PM IST
Ysrcp leader joni kumari suicide attempt during press meet

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరోమారు అసంతృప్తులు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు వైసీపి పార్టీని నమ్మితే గొర్రె కసాయివాడిని నమ్మినట్టేనని వ్యాఖ్యలు చేసి.. తన అసంతృప్తిని వ్యక్తం చేసిన క్రమంలోనే విజయవాడలో వైఎస్సార్‌సీపీ పార్టీకి చెందిన మహిళా నేత ఏకంగా మీడియా ముఖ్యంగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు అమె మీడియా సమావేశస్థలికి చేరుకుని అమెను ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు అధికార పక్షాన్ని అందుకోవడం కోసం.. పగ్గాలను చేపట్టడం కోసం రాజకీయ నేతలు, పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా హామీలను గుప్పించడం సర్వసాధారణమే.

అనితర సాథ్యమయ్యే హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం నిత్యం జరిగే విషయమే అయినా.. నాయకులకు మాత్రం ఆశల వలయంలో బంధించి.. ఆ తరువాత ముఖం కూడా చూడకపోవడంతో పలు సందర్భాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి. అదే తరహాలో విజయవాడ మాల మహానాడు అధ్యక్షురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. తన సమస్యలు పరిష్కరించాలని సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్‌ మధ్యలోనే ఆమె విషం తాగేశారు. ఒకట్రెండు సార్లు ఆమె విషం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ పెద్దలు తనని మోసం చేసారని జోని కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ కరోనా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునే అవకాశం లేదని.. ఈ విషయంపై పార్టీ అధినాయకులను కలిసినా ఇప్పటి వరకు అసలు స్పందించలేదన్నారు. వైస్సార్సీపీ పార్టీని సొంత కుటుంబంలా భావిస్తే పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు తనని మోసం చేసారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 6న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిని కలిశానని.. అయినా తనకు న్యాయం జరగలేదన్నారు జోని కుమారి. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles