JEE (main & advanced), NEET exams postponed నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు వాయిదా

Neet entrance exam postponed to september 13 jee mains to be held from september 1 6

Education News, neet-ug,The Ministry of Human Resource Development, Siddharth Pandey, National Testing Agency, National Eligibility and Entrance Test, Joint Entrance Examination, JEE NEET Exam date, Ramesh Pokhriyal, HRD Minister, NEET, JEE Mains, JEE Advance, National Eligibility Test, Postpone, coronavirus, covid-19

The Joint Entrance Examination (main and advanced) and the National Eligibility cum Entrance Test (undergraduate) have been postponed to September 2020. A decision to this effect has been taken on Friday following the recommendation of the expert committee set up by the ministry of human resource development

ITEMVIDEOS: నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు వాయిదా

Posted: 07/03/2020 11:44 PM IST
Neet entrance exam postponed to september 13 jee mains to be held from september 1 6

కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై చూపుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. సీబిఎస్ఈ 10 తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో వాటి తరువాత నిర్వహించాల్సిన అన్ని ప్రవేశపరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నీట్‌, జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. విద్యార్ధుల అరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్  కొత్త తేదీలను ప్రకటించారు.

సెప్టెంబర్‌  1 - 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు, సెప్టెంబర్‌ 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ వెల్లడించారు. అలాగే, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన ట్విటర్‌లో తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు. వాస్తవానికి గత నెలలో జరగాల్సిన ఈ పరీక్షలు లాక్‌డౌన్‌తో కేంద్రం ఈ నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, కొవిడ్‌ కేసులు దేశంలో మరింతగా పెరిగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని నిపుణుల సూచనల మేరకు పరీక్షలను మరోసారి వాయిదావేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles