Bharat BioTech clarifies on Covid-19 Covaxine fake news సోషల్ మీడియాలో కోవాక్సీన్ పై దుష్ప్రచారం

Bharat biotech clarifies on covid 19 covaxine fake news online

VK Srinivas, Vice President, coronavirus vaccine, corona vaccine, covid vaccine, covid-19 vaccine, inidan corona vaccine, indian vaccine clinical trails, Bharat Biotech corona vaccine, ICMR corona vaccine, corona vaccine human trails, immune defences, Bharat biotech, covaxin, ICMR, indian vaccines

A coronavirus vaccine from Indian Pharma company Bharat BioTech has given clarification on the fake news that goes viral on social media, stating that the company Vice President has taken the vaccine without human trials test.

కరోనా వాక్సీన్: సోషల్ మీడియాలో కోవాక్సీన్ పై దుష్ప్రచారం

Posted: 07/03/2020 11:54 PM IST
Bharat biotech clarifies on covid 19 covaxine fake news online

కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ దేశ ప్రజలకు శుభవార్త అందించిన భారత దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ పై అప్పుడే సోషల్ మీడియాలో విషం చిమ్మే కథనాలు పుట్టుకోచ్చాయి. ఆగస్టు 15 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. క్రియా రహిత వైరస్ ఆధారిత ఈ వ్యాక్సిన్, జంతువుల్లో పూర్తి సత్ఫలితాలను ఇవ్వగా, మానవులపై క్లినికల్ ట్రయల్స్ కు కూడా అనుమతి పోందింది.

ఇక హ్యూమన్ ట్రయల్స్ కూడా ప్రారంభించిన విషయాన్ని ఇవాళ ఉదయమే ప్రకటించాయి. దీంతో అప్పుడే ఈ సంస్థపై విషకథనాలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ప్రచారాలకు వేదికలుగా మారిన సోషల్ మీడియాలో భారత్ బయోటెక్ సంస్థకు చెందిన అసత్యవార్తలు అలజడి సృష్టించాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ అంశంలోనూ మరోసారి నిరూపితమైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు ఐసీఎంఆర్ తో కలిసి పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ అందించగలమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం మానవులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

అయితే, భారత్ బయోటెక్ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీకే శ్రీనివాస్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ నర్సు ఆయన చేతికి ఇంజెక్షన్ గుచ్చుతున్నట్టుగా ఉన్న ఆ ఫొటో భారత్ బయోటెక్ సంస్థ దృష్టికి వచ్చింది. దాంతో ఆ పరిశోధక సంస్థ వెంటనే వివరణ ఇస్తూ, ఆ ఫొటో వాస్తవం కాదని, ప్రచారం అవుతున్న న్యూస్ ఫేక్ అని స్పష్టం చేసింది. అది తమ ప్రొడక్షన్ స్టాఫ్ కు నిత్యం నిర్వహించే వైద్య పరీక్షల కోసం రక్తం సేకరిస్తున్నప్పటి ఫొటో మాత్రమేనని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles