Age of expansionism over: Modi in Ladakh సైన్యానికి ప్రేరణగా ప్రధాని.. చైనాపై చురకలు.. ఖంగుతిన్న చైనా

Indias enemies have seen your fire and fury pm modi

India China Border Tensions, PM Modi In ladakh, Modi Addresses Indian Army, PM Modi, Narendra Modi, India, China, Prime Minister, Ladakh, galwan valley, Line of Actual Control, India-china trails

Days after a violent face-off between Indian and Chinese troops in East Ladakh, Prime Minister Narendra Modi on Friday reached Leh where he addressed the personnel of the Indian Army. PM Modi paid tributes to the soldiers who were killed during the Galwan Valley face-off.

సైన్యానికి ప్రేరణగా ప్రధాని.. చైనాపై చురకలు.. ఖంగుతిన్న చైనా

Posted: 07/03/2020 11:32 PM IST
Indias enemies have seen your fire and fury pm modi

సరిహద్దుల్లో అహర్నిశలు మీరు కాపలాకాయబట్టే యావత్ దేశం నిశ్చింతగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ జవాన్ల సేవలను కోనియాడుతూ వారికి ప్రేరణ కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులు లడ్డాక్ ఘటన ద్వారా ప్రపంచం మొత్తానికి భారత్‌ శక్తి సామర్థ్యాలు నిరూపించామని కొనియాడారు. అదే సమయంలో చైనాకు ధీటైన జవాబు ఇచ్చేలా కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప‌్ర‌పంచంలో విస్త‌ర‌ణ‌వాద శకం ముగిసింద‌ని అన్నారు. ఇంత‌కాలం విస్త‌ర‌ణకాంక్ష‌తో దూసుకెళ్లిన శక్తులు కూడా తమ నిర్ణయాలను ఉపసంహరించుకున్నాయని అన్నారు. అలా కానీ పక్షంలో ఓటములు ఇచ్చిన గుణపాఠాలతో వెనక్కి తగ్గాయని అందుకు చ‌రిత్ర‌ సాక్షాత్క‌రంగా నిలుస్తోందని అన్నారు. ప్రస్తుతం దేశాలన్నీ అభివృధ్దీలో పోటీపడుతూ పనిచేస్తున్నాయని, విస్త‌ర‌ణ ఇది స‌మ‌యం కాదని చైనాకు ప‌రోక్షంగా చుర‌క‌లంటించారు.

వాస్త‌వాధీన రేఖ వెంట దురాక్ర‌మ‌ణ‌‌కు పాల్ప‌డుతూ, స‌రిహ‌ద్దు వివాదాల‌ను సృష్టిస్తోన్న చైనాకు ఈ వ్యాఖ్యల ద్వారా దీటైన సందేశాన్ని పంపించారు. ల‌డాఖ్ లో ప‌ర్య‌టించిన ప్రధాని సైనికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. గల్వాన్ ఘటనలో శత్రువులకు మీ ప‌రాక్ర‌మం చూపించారని అన్నారు. ఈ సందర్భంగా గల్వాన్‌ ఘటనలో అమరులైన సైనికులకు ప్రధాని మరోసారి నివాళులర్పించారు. ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు భారత సైనిక బలగాలతో ఉన్నాయని అన్నారు. భారత సైన్యం శౌర్య పరాక్రమాల గురించి దేశంలో ఇంటింటా మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఈ భూమి 130 కోట్ల మంది భారతీయులకు ప్రతీకని.. విఛ్చిన్న శక్తుల కుట్రలను లడాఖ్‌ స్థానిక ప్రజలు తిప్పికొట్టారు.

14 దళాలకు చెందిన సైనికుల పరాక్రమం గురించి దేశం నలుమూలలా మాట్లాడుకుంటున్నారని చెప్పారు. సైన్యం సాహస గాథలు దేశంలోని ప్రతి ఇంటిని చేరాయని చెప్పారు. శత్రువులకు సైన్యం పరాక్రమ జ్వాల ఏంటో చూపించారని ప్రధాని సైనికుల ధైర్య సాహసాల్ని కొనియాడారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఇంట్లో భార‌త సైనికుల సాహ‌స గాథ‌ల గురించి మాట్లాడుకుంటున్నారని ప్ర‌ధాని మోదీ సైనికుల‌ను కొనియాడారు. అంతేకాకుండా, వేల సంవ‌త్స‌రాల నుంచి ఎన్నో దాడుల‌ను తిప్పికొట్టిన మ‌న సంక‌ల్పం ఎంతో గొప్ప‌దని అన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ శ‌క్తి సామ‌ర్థ్యాలు అజేయం. జ‌ల, వాయు, ప‌దాతి, అంత‌రిక్ష విభాగాల్లో మ‌న శ‌క్తి స‌మున్న‌త‌మ‌ని అన్నారు. ధైర్య సాహ‌సాల‌తోనే శాంతి లభిస్తుంద‌ని, బ‌ల‌హీనులు ఎప్ప‌టికీ శాంతిని సాధించ‌లేరని న‌రేంద్ర మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్రపంచ యుద్ధాల్లోనైనా, ప్రపంచంలో శాంతి నెలకొల్పడంలోనైనా అంతర్జాతీయ సమాజం భారతీయుల ధైర్యసాహసాల్ని చూసింది. మనం వేణువు ఊదే కృష్ణుడిని పూజిస్తాం.. అలాగే సుదర్శన చక్రంతో పోరాడే కృష్ణుడినీ ఆరాధిస్తాం. సామ్రాజ్యవాద శకం ముగిసింది. ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ల‌ద్దాఖ్‌‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలియ‌గానే చైనా ఉలిక్కిప‌డింది. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌పై వెంట‌నే చైనా విదేశాంగశాఖ‌ స్పందించింది. 'స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించేందుకు ఇప్ప‌టికే ఇరుదేశాలు సైనిక, దౌత్య‌ప‌రంగా చ‌ర్చ‌లు జరుపుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ప‌రిస్థితి తీవ్ర‌త‌ను పెంచే ఎలాంటి చ‌ర్య‌ల్లో ఎవ్వ‌రూ పాల్గొన‌కూడ‌దు' అని చైనా విదేశాంగ అధికార ప్ర‌తినిధి ఝావో లిజియ‌న్ ప్ర‌క‌టించారు. మోదీ లద్దాఖ్‌ పర్యటనపై తన అసంతృప్తిని వెళ్లగక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles