Southwest monsoon likely to hit Kerala by June 5: IMD ఆలస్యంగా నైరుతి రుతుపవనాల ఆగమనం

Southwest monsoon over kerala to be delayed by four days imd

monsoon,monsoon 2020,monsoon in india,monsoon rains in india,arrival of monsoon,arrival of monsoon in india,southwest monsoon,arrival of southwest monsoon,monsoon season in india, departure of monsoon from india,departure of southwest monsoon, India Meteorological Department (IMD), monsoon 2020, monsoon in india, southwest monsoon, Rains in India, Rain Alert, southern states, central India, IMD

The onset of southwest monsoon over Kerala likely to be delayed by four days, said the India Metrological Department (IMD) weather forecast on Friday. The weather report further stated that the monsoon is expected to hit the southern state on June 5, 2020.

నాలుగు రోజులు ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

Posted: 05/15/2020 06:05 PM IST
Southwest monsoon over kerala to be delayed by four days imd

దేశంలోకి ఈ ఏడాది రుతుపవనాలు రెండు రోజులు ముందుగానే వస్తుందని గతవారం క్రితం చెప్పిన భారత వాతావరణ కేంద్రం తాజాగా రుతుపవనాల ఆగమనం కొంత ఆలస్యం కానుందని తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనుండగా.. ఈ ఏడాది మాత్రం జూన్ 5కి నాలుగు రోజుల ముందు లేదా వెనుక తాకుతాయని పేర్కొంది. దేశంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తొలుత తాకి.. తర్వాత దేశమంతటా విస్తరిస్తాయి. కేరళ నుంచి కర్ణాటక మీదుగా ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. సాధారణంగా మే 22 నాటికి అండమాన్ దీవులలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి వచ్చే 12 గంటల్లో తుఫానుగా మారనుంది. ఈ తుఫాను వల్ల అండమాన్ తీరంలోకి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది. గడచిన ఐదేళ్లలో ఐఎండీ అంచనా వేసినట్టే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2015లో మాత్రం ఐఎండీ అంచనా తప్పింది. ఈ ఏడాది మే 30న రుతుపవనాలు తాకుతాయని అంచనా వేయగా.. వారం రోజుల ఆలస్యంగా జూన్ 5న తాకాయి. 2016లో జూన్ 7కి వస్తాయని చెబితే.. జూన్ 8న, 2017లో ఐఎండీ అంచనా వేసినట్టు మే 30న, 2018లో మే 29న దేశంలోకి రుతుపవనాలు వచ్చాయి. గతేడాది మాత్రం ఐఎండీ అంచనా కంటే రెండు రోజులు ఆలస్యంగా జూన్ 8న కేరళ తీరాన్ని తాకాయి.

కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో శుక్రవారం వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం అదే ప్రాంతంలో తుఫపానుగా మారొచ్చని సూచించింది. 17 వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, 18, 19 తేదీల్లో ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు కదలొచ్చని వివరించింది. మరఠ్వాడ నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 43డిగ్రీలు నమోదు కావొచ్చని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles