Canada shooting: Gunman kills at least 16 in Nova Scotia లాక్ డౌన్ వేళ.. కెనడాలో మారణహోమం.. 16 మంది మృతి

Canada shooting gunman kills 16 people after rampage in nova scotia

Canada, Nova Scotia, Gun crime, mass killings, police dress, police vehicle, World news, Americas, coronavirus, covid-19

A gunman in Canada posing as a police officer has killed 16 people after a 12-hour shooting rampage across Nova Scotia in the worst act of mass murder the country has seen in modern times.

లాక్ డౌన్ వేళ.. కెనడాలో మారణహోమం.. 16 మంది మృతి

Posted: 04/20/2020 11:26 AM IST
Canada shooting gunman kills 16 people after rampage in nova scotia

కరోనా వైరస్ విఫపు కోరల్లోంచి తమ తమ పౌరులను బయటపడేసేందుకు, ప్రపంచంలని దేశాలు అన్ని లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో కెనడాలో మారణహోమం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కెనడావాసులు ఉలిక్కిపడ్డారు. దేశంలో తీవ్రవాదం సహా ఎలాంటి భారీ ఘటనలకు తావులేకుండా సామరస్యంగా సాగుతున్న కెనెడాలో ఈ ఘటన భీతావాహ ఘటనలను సృష్టించింది. గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ జరగని దారుణం జరిగింది. విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో పాటు పలు ఇళ్ల దహనమయ్యాయి.

పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ అమల్లో ఉండగా తనను ఎవరూ అపకుండా అగంతకుడు పోలీసు దుస్తులు ధరించాడా లేక అతని ఉద్దేశ్యమేంటనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నోవా స్కోటియా రాష్ట్రంలోని పోర్టాపిక్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా పోలీసు కూడా మృతి చెందింది. దుండగుడు ఇళ్లలో ఉన్నవారిపై కాల్పులు జరిపిన అనంతరం ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఒక ఇంటి లోపల, బయట చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తన కారును పోలీసు వాహనంలా తీర్చిదిద్దిన ఆగంతుకుడు పోలీసు దుస్తులు ధరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఆ తర్వాత జరిగిన అతి పెద్ద ఘటన ఇదే. నిందితుడిని 51 ఏళ్ల గాబ్రియెల్ వోర్ట్‌మన్‌గా గుర్తించారు. దుండగుడిని అరెస్ట్ చేసినట్టు తొలుత చెప్పిన పోలీసులు.. ఆ తర్వాత అతడు హతమైనట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Canada  Nova Scotia  Gun crime  mass killings  police dress  police vehicle  World news  Americas  coronavirus  covid-19  

Other Articles