Six more test positive for Covid-19, count 27 in Telangana తెలంగాణలో 27కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus updates six more test positive for covid 19 count 27 in telangana

coronavirus in india, coronavirus, covid-19, corona spread, section 144, Delhi, noida, section 144 coronavirus, No Public Gathering, noida police commissioner, Gautam Budh Nagar, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Six more persons — all with recent travel history to coronavirus-hit countries — tested positive for Covid-19 in Hyderabad, taking the total number of cases to 27 in Telangana. All the six, who reached Hyderabad from corona hit countiries are under treatment in isolation wards and their close contacts, including family, are under home quarantine, officials said.

కరోనా వైరస్ అలర్ట్.. తెలంగాణలో 27కి చేరిన పాజిటివ్ కేసులు

Posted: 03/23/2020 09:38 AM IST
Coronavirus updates six more test positive for covid 19 count 27 in telangana

ప్రపంచవ్యాప్తంగా కళారా నృత్యం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ప్రభుత్వాలు అప్రమత్తమై ప్రజలు బయటకు రాకుండా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూను విధించి.. ఆ తరువాత ఏకంగా ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించి.. ప్రజారోగ్యం పరిరక్షించాలని, కరోనా మహమ్మారిని భారత్ నుంచి తరిమి కొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే వున్నా తెలంగాణలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. యావత్ దేశం జనతా కర్ఫ్యూ పాటించిన రోజే.. తెలంగాణలో ఆరు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కోవిడ్-19 కేసులు 27కు చేరుకున్నాయి.

ఇప్పటికే ఒకరు కోలుకోగా.. మరో 26 మంది మాత్రం చికిత్స పొందుతున్నారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని.. కేవలం ఒకే ఒక్కరికి ప్రైమరీ కాంటాక్ట్ (కరోనా బాధితుడి నుంచి మరొకరికి సోకడం) ద్వారా వైరస్ సోకిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కరోనా రాదని ప్రతి ఒక్కరు అందుకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అందరూ వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

ఇక తాజాగా కరోనా వ్యాధి పాజిటివ్ గా నమోదైన ఆరు కేసుల్లో నలుగురు వ్యక్తులు ముఫై ఏళ్ల లోపు వారు కావడం, మరోకరు 35 ఏళ్లకు మించివుండకపోవడంతో ఈ వ్యాధి అన్ని కేవలం వృద్దలు, చిన్నారులపైనే అధికా ప్రభావం చూపుతుందన్న వార్తల్లో నిజం లేదని, అన్ని వయస్సుల వారిపై ఇది ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.  ఇక మరో పాజిటివ్ కేసులో బాధితురాలు యాభై ఏళ్ల మహిళ కావడం.. అమె కూడా విదేశాల నుంచి ఈ నెల 14న హైదరాబాద్ కు రావడంతో అమెకు ఈ వైరస్ సోకింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles