Coronavirus: Trump suspends travel from Europe to US కోవిడ్-19: యూరోప్ పై దేశస్థుల అగమనంపై నిషేధం..

Coronavirus trump s travel restrictions italy in lockdown and kuwait follows

corona virus, travel ban, Europe, india, white house, donald trump, Itally, United Kingdom, World Health Organization, WHO, COVID-19, CoronaVirus, global pandemic, coronavirus rapid spread, 110 countries, 121,000 people infected world wide, Asia, Middle East, Europe, United States, 110 countries, china, russia, iran, kuwait, pandamic, schools, Quarantile, World economy, Asia Economy, Biotechnology

President Trump announced that he was taking action to stem the spread of the coronavirus by suspending most travel from Europe to the United States for 30 days, beginning on Friday. The restrictions do not apply to Britain, he said.

కోవిడ్-19: యూరోప్ పై ట్రావెల్ బ్యాన్.. ఉద్దీపన్ ప్రకటించిన బ్రిటన్

Posted: 03/12/2020 01:04 PM IST
Coronavirus trump s travel restrictions italy in lockdown and kuwait follows

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ బారి నుండి తమ దశస్థులను రక్షించుకునే పనిలోభాగంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందస్తు నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా యూరప్ లోని అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాన్ని విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. శుక్రవారం ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు కూడా తెలిపారు. ఏకంగా 30 రోజుల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని వైట్ హౌస్ ప్రకటించింది. "ఇది కాస్తంత కఠినమైన నిర్ణయమే అయినా, తప్పనిసరి" అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

యూకే వ్యాప్తంగా 460 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇటలీలో వైరస్ విజృంభించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిషేధాజ్ఞాలు బ్రిటన్ కు వర్తించవని కూడా ఆయన తన ఆదేశాల్లో పేర్కెన్నారు. ఇదే సమయంలో అగ్రరాజ్యవాసులకు మరో శుభవార్తనందించాడు. అగ్రరాజ్యంలోని హెల్త్ ఇన్యూరెన్స్ కంపెనీలు కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు కూడా చికిత్సను అందించేందకు ముందుకువచ్చాయని ఆయన ప్రకటించారు. ఇక ఈ వ్యాధిభారిన పడి గృహనిర్భంధంలోనే ఉండాల్సివచ్చిన రోగులకు త్వరలోనే తాను అర్థిక సాయాన్ని కూడా ప్రకటిస్తానని తెలిపారు.

ఉద్దీపన ప్రకటించిన బ్రిటన్

ఇక కరోనా కారణంగా అర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఆర్థిక సవాళ్లను ఎదుర్కోనేందుకు ఏకంగా రూ.3లక్షల కోట్లతో ఉద్దీపన ఫ్యాకేజీని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకువచ్చేందుకు ప్రజలు వినియోగం, వ్యవయాలను పెంచేందుకు వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. దీనికి సంబంధించిన బ్రిటన్ అర్థిక మంత్రి ఆ దేశ కేంద్రీయ బ్యాంకుకు అధికారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను ఇరువర్గాలు వేర్వురుగా ప్రకటించాయి.

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థైన బ్రిటన్ కుదేలవుతుందని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితి నెలకొందని.. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయని చెప్పారు. అయితే ఇదంతా తాత్కాలికమేనని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా 3,900 కోట్ల డాలర్లతో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయనున్నట్టు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona virus  travel ban  Europe  india  white house  donald trump  Itally  United Kingdom  

Other Articles