Harvey Weinstein Sentenced to 23 Years హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్ కు 23 జైలుశిక్ష

Harvey weinstein sentenced to 23 years in prison for rape and sex assault

#MeToo movement, Harvey Weinstein, Film producer, Manhattan state court, rape and sex assault case, Harvey Weinstein Sentencing, Harvey Weinstein metoo, jennifer aniston, Harvey Weinstein and jennifer anistonlife sentence, hollywood, crime

Film producer Harvey Weinstein was sentenced Wednesday to 23 years in prison for a rape and sex assault case that ignited the #MeToo movement in the United States. The sentence in Manhattan state court was less than the maximum 29 years requested by prosecutors, but could amount to an effective life sentence for the 67-year-old Weinstein, who has been in apparently frail health since being jailed following his conviction Feb. 24.

హాలీవుడ్ #మీటూ ఉద్యమానికి కారకుడైన నిర్మాతకు జైలుశిక్ష

Posted: 03/12/2020 01:56 PM IST
Harvey weinstein sentenced to 23 years in prison for rape and sex assault

హాలీవుడ్ లో మీటూ ఉద్యమానికి కారకుడైన నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్ కు న్యాయస్థానం శిక్షను ఖారారు చేసింది. ఎంతో మంది నటీమణులతో పాటు హీరోయిన్లపై కూడా లైంగిక దాడులకు పాల్పడ్డారన్న అభియోగాలను ఎదుర్కోంటున్న ఆయనకు అమెరికాలోని మన్ హట్టాన్ న్యాయస్థానం 23 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ తీరపును వెలువరించింది. ఆయన చేసిన దారుణాలను ధైర్యంగా తొలుత జెన్నీఫర్ అనీస్టన్ బహిర్గతం చేసింది. హార్వీ ఎంతోమంది నటీ మణులను సిని అవకాశాల కోసం లోంగదీసుకున్నాడని, వారిని లైంగికంగా వేధించాడని అరోపణలు చేసింది. దీంతో ఆయన జెన్నీఫర్ ను కాల్చేయాలని కూడా ఘాటువ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అతనిపై దాఖలైన పిటీషన్లను విచారించిన న్యాయస్థానం.. ఆరోపణలు రుజువైనందున హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్ ను దోషిగా నిర్థారించింది. ఇవాళ ఆయనకు శిక్షను ఖారారు చేస్తూ 23 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పిచ్చింది. హార్వీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల శిక్ష మాత్రమే విధించాలని ఆయన తరఫు లాయర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి జేమ్స్ బుర్కే తోసిపుచ్చారు. వాస్తవానికి ఆయనకు 29 సంవత్సరాల శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు భావించినా, సమాజానికి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని కొంత శిక్షను తగ్గించామని న్యాయస్థానం పేర్కొంది.

కాగా, ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన హార్వీ, వీల్ చైర్ లోనే కోర్టుకు హాజరయ్యారు. తీర్పు అనంతరం మాట్లాడిన ఆయన, తనకంతా అయోమయంగా ఉందని, ప్రస్తుతం తాను దేశం కోసం బాధపడుతున్నానని అన్నారు. దాదాపు 90 మందిని ఆయన శారీరకంగా వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సినిమా అవకాశాలను ఎరజూపిన హార్వీ తమను మోసం చేశాడంటూ ఎంతో మంది ఫిర్యాదులు చేయడంతో, గత సంవత్సరం ఫిబ్రవరిలో 12 మంది సభ్యుల జ్యూరీ విచారణ చేపట్టి, అన్నీ వాస్తవాలేనని తేల్చింది. హార్వీ చేత వేదింపులు ఎదుర్కోబడిన వారిలో ఏంజెలినా జోలీ, సల్మా హయక్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం విస్తరించడానికి నాంది పలికిన సంఘటనగా హార్వీ కేసు పేరుతెచ్చుకుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles