IT sleuths raids on private colleges in Hyderabad తెలుగు రాష్ట్రాల్లోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు..

It raids on sri chaitanya and narayana junior colleges in ap and telangana

IT Raids, Sri Chaitanya College, Narayana college, Private Junior colleges, High court, Narayana jr college, Sri Chaitanyna jr college, Telangana, Income Tax officials, corperate colleges, corporate offices, Madhapur, Hyderabad, Students fees, Teachers salaries, irregularities in financial issues, Madhapur, Andhra Pradesh, Politics

The Income Tax Department officials have conducted a surprise raid on the central offices of Sri Chaitanya and Narayana junior college at morning around 5 am in Hyderabad

తెలుగు రాష్ట్రాల్లోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు..

Posted: 03/04/2020 03:51 PM IST
It raids on sri chaitanya and narayana junior colleges in ap and telangana

తెలుగు రాష్ట్రాలలోని కార్పోరేట్ కాలేజీలపై ఆదాయ పన్నుశాఖ ఎట్టకేలకు దృష్టిసారించింది. లక్షల రూపాయాల్లో ఒక్కో విద్యార్థి నుంచి ఫీజులు తీసుకుని.. తప్పుడు లేక్కలు చూపుతున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఎట్టకేలకు అదాయ పన్నుశాఖ అధికారులు ఈ కాలేజీలపై దాడి చేసి ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే తెలంగాణలో గుర్తింపులేని, సరైన అనుమతులు లేని కార్పోరేట్ కాలేజీల విషయంలో చర్యలు తీసుకోవాలని హైకోర్టు అదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా ఏప్రిల్ 3 లోగా రాష్ట్రంలోని నారాయణ, శ్రీచైతన్య సహా ఇతర కార్పోరేట్ జూనియర్ కళాశాలలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని న్యాయస్థానం అదేశించింది. ఇక తాజాగా ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలోని బెంజ్‌ సర్కిల్‌ వద్ద గల నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్ లలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ ఉదయం నుంచి కాలేజీలపై దాడులు చేసి.. కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. విద్యార్థుల నుంచి లక్షల్ల రూపాయల ఫీజులు పొంది. లెక్చరర్లకు తక్కువ జీతాలిచ్చి.. ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు అరోపణలు వున్నాయి.

ఈ నేపథ్యంలో జీతాలకు రెండేసీ అకౌంట్ పుస్తకాలను ఏర్పాటు చేసిన రెండింటిలో ఉపాధ్యాయులు, స్టాప్, నాన్ టీచింగ్ స్టాప్ నుంచి సంతకాలు తీసుకుంటారని కూడా అరోపణలు వున్నాయి. ఇక విద్యార్థుల నుంచి కూడా లక్షల రూపాయల్లో ఫీజులు తీసుకుని.. కేవలం వేలల్లో మాత్రమే తీసుకుంటున్నట్లు మరో అకౌంట్ చూపిస్తూ.. లక్షలాది రూపాయల పన్నును ఎగ్గోడుతున్నారని వీరిపై అరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కాలేజీ యాజమాన్యాలు పెట్టుకున్న రెండు వేర్వేరు రిజిస్టార్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

ఉదయం 8 గంటల నుంచి ఐటీ అధికారులు నారయణ, శ్రీచైతన్య కాలేజీలలో తనిఖీలు జరుపుతున్నారు. నారాయణ క్యాంపస్‌కు వెళ్లిన ఐటీ అధికారులు.. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కాలేజీ సిబ్బందిని బయటకు పంపించి సోదాలు చేస్తున్నారు. తాటి గడప, ఈడ్పుగల్లులోని క్యాంపస్‌లలో కూడా దాడులు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సమీపంలో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్‌ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్టులను స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IT Raids  Sri Chaitanya College  Narayana college  Students fees  Telangana  Andhra Pradesh  Politics  

Other Articles