Coronavirus Case in Hyd Raheja Mindspace రహేజా మైండ్ స్పేస్ లో కరోనా వైరస్ కేసు.!

Hyd techie tested positive mindspace shuts down

Coronavirus, Coronavirus news, Coronavirus new case, Coronavirus cases, Coronavirus Hyderabad, Coronavirus latest, Coronavirus in Raheja Mindspace, Coronavirus latest updates, Coronavirus Case in Raheja Mindspace, Hyderabad, remedy for Coronavirus, covid-19, Telangana, Health

The coronavirus seems to be fast spreading across the country. The number of cases has been increasing on a regular basis. A new case of coronavirus has been registered in the city after a person working in Building 20 of Raheja Mindspace has been tested positive with coronavirus.

హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్ లో కరోనా వైరస్ కేసు.!

Posted: 03/04/2020 02:57 PM IST
Hyd techie tested positive mindspace shuts down

యావత్ ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ నగరంలో కూడా జడలు విప్పుతోంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్ కు బస్సులో వచ్చిన ఓ సాప్ట్ వేర్ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వ వైద్యఅరోగ్య శాఖ అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ పేషంటును గాంధీ అసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి అక్కడి అతనికి చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. అతను నివసించే మహేంద్రహిల్స్ కాలనీ, బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు, ఇలా అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.

ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో కరోనా వైరస్ అలజడి సృష్టిస్తోంది. మరో ఇద్దరిలో వైరస్ లక్షణాలను గుర్తించారు. గాంధీ మెడికల్ కాలేజీలోని ఐసీఎమ్ఆర్‌‌ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరి రిపోర్టులు  పాజిటివ్‌గా వచ్చాయి. దాంతో, వారి శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల కోసం పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలాజీ (ఎన్ఐవీ)కి పంపించారు. గురువారం ఎన్‌ఐవీ నుంచి రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐవీలో కూడా పాజిటివ్‌ అని తేలితే ఆ ఇద్దరికీ కరోనా సోకిందని నిర్ధారిస్తారు.
 
ఈ ఇద్దరిలో ఒకరు వైరస్‌ బారిన పడిన సాఫ్ట్‌వేర్‌‌ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తి కాగా, మరొకరు ఇటలీకి వెళ్లొచ్చినట్టుగా గుర్తించారు. సాఫ్ట్ వేర్‌‌‌ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వారితో సహా మంగళవారం మొత్తం 47 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేయగా 45 మంది రిపోర్టులు నెగిటివ్‌గా వచ్చాయి. వాళ్లందరినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, 14 రోజుల పాటు తమ నివాసాల్లో ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్టు గాంధీ ఆసుపత్రి ప్రజారోగ్య డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ జి. శ్రీనివాస్‌ రావు తెలిపారు. ఇక, కరోనా బారిన పడి గాంధీ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న సాప్ట్‌వేర్‌‌ ఉద్యోగి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles