Devotees concern on flights fly over Tirumala Temple శ్రీవారి ఆలయం మీదుగా విమానం.. భక్తుల్లో కలవరం..

Devotees concern on flights fly over tirumala temple

Devotees concern on flights fly over Tirumala Temple, Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Tirumala High Security Zone, Tirumala No Flying Zone, Tirumala Flights, Tirumala Survey of India Flight, Tirumala devotees, National Survey of India, Dharma reddy, SVBC Channel MD, Tirumala news, devotional

Devotees concern over the flights fly over no flying zone at Tirumala Tirupati Devasthanams (TTD) since past two days. Vigilence reported the issue with Air Traffic Control at Chennai and came to know that flight belongs ot Survey of India.

తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానం.. భక్తుల్లో కలవరం..

Posted: 02/05/2020 12:08 PM IST
Devotees concern on flights fly over tirumala temple

కలియుగ ప్రత్యక్ష దైవం.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి ఏడు కొండలపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈ చర్యలతో తిరుమల కొండపై వున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా విమానం ఆలయం మీదుగా వెళ్లడంతో టీటీడీ అధికారులు, విజిలెన్స్, భద్రతాధికారులు, సిబ్బంది, భక్తులు అందరూ ఉలిక్కి పడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానం ఎలా వెళ్లిందని భక్తులు మండిపడుతున్నారు. విమానాశ్రయ అధికారులు తిరుమల కొండల మీదుగా విమానం వెళ్లేందుకు ఎలా అనుమతించారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

అయితే విమానం వెళ్లిందని భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విమానం నేషనల్ సర్వే అఫ్ ఇండియాకు చెందినదగా గుర్తించి.. కేవలం భౌగోళిక పరిస్థితుల అధ్యయనానికి మాత్రమే విమానం వచ్చిందని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం తిరిగిందని, ఇది ఆగమశాస్త్రానికి విరుద్దమని ఇలా విమానాలు ఎలా వెళ్తాయని పండితులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను ఎన్నో ఏళ్ల క్రితమే నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారని గుర్తు చేశారు.

ఇలాంటి స్పష్టమైన నిబంధనలు వున్న తరువాత కూడా చెన్నై ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన విమానానికి శ్రీవారి కొండల మీదుగా వెళ్లేందుకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి. శ్రీవారి ఏడు కొండలకు ఉన్న ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు భక్తులు మండిపడతున్నారు. గతంలో కూడా ఇలాగే శ్రీవారి ఆలయం మీదుగా పలు సందర్భాలలో విమానాలు వెళ్లగా.. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుల నేపథ్యంలో బ్రేకులు పడ్డాయని భక్తులు తెలిపారు.  టీటీడీ ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ఛైర్మన్‌ పదవికి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో కొనసాగుతున్న సినీనటుడు వృథ్వీపై ఛానల్ ఉద్యోగిని పలు అరోపణలు చేయడంతో ఆయనను ఛానల్‌ చైర్మన్ పదవి నుంచి పక్కన బెట్టిన ప్రభుత్వం.. ఈ ఛానెల్ మెనేజింగ్ డైరెక్టర్ పదవికి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఇవాళ ఎస్వీబిసి ఛానెల్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ధర్మారెడ్డి ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఈవోగా ఉన్నారు.. దీనితో పాటూ ఎస్వీబీసీ ఛానల్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles