AP CM YS Jagan key statements on Amaravati అమరావతిలో రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Andhra pradesh cm key statements on capital decentralisation and amaravati

CM Jagan, AP CM YS Jagan, YS Jagan on Amaravati, YS Jagan on Three Capitals, YS Jagan on capital decentralisation, Amaravati JAC, Mangalagiri, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Andhra Pradesh CM YS JaganMohan Reddy made Key statements on Capital decentralisation and Amaravati at a Programme held in Vijayawada, while the residents of villages in the CRDA region continued to hold sit-ins and relay hunger strikes.

అమరావతిలో రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Posted: 02/05/2020 11:25 AM IST
Andhra pradesh cm key statements on capital decentralisation and amaravati

అమరావతిలోనే పూర్తిస్థాయి రాజధానిని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు గత 50 రోజులుగా నిరసన కార్యక్రమాలను చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు, అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ది సమపాళ్లలో జరగాలని తమ ప్రభుత్వం అభిమతమని తేల్చిచెప్పాన ఆయన ఈ క్రమంలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని తేల్చి చెప్పారు. ఇదే సందర్భంలో ఆయన అమరావతి రైతులకు కూడా స్పష్టతనిచ్చారు. అమరావతిలో రాజధాని నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని.. అయితే అన్ని నిధులు తమ ప్రభుత్వం వద్ద లేవని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.

విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. తమ ప్రభుత్వం క్లారిటీతో ముందుకువెళ్తోందని చెప్పుకోచ్చిన ఆయన ప్రజల్ని మభ్యపెట్టాలని, గ్రాఫిక్స్ చూపించాలని తాను అనుకోడంలేదని.. రాజధానిపై తాము బాహుబలి గ్రాఫిక్స్ చూపించమని చెప్పారు. ఇక తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ఎందుకునేందుకు కారణాలు కూడా క్రిస్టల్ క్లియర్ గా వున్నాయని చెప్పుకోచ్చారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అందుకనే అక్కడ రాజధాని ఏర్పాటు తక్కువ నిధులతో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

అయితే అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగుతుందని.. సచివాలయం, సీఎం ఆఫీస్, మంత్రులు, హెచ్‌ఓడీలు విశాఖలోనే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో అభివృద్ధి కొనసాగుతుందని.. పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. విశాఖలో అభివృద్ధికి అపార అవకాశం ఉందన్నారు సీఎం. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదని.. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని.. భవిష్యత్ తరాలకు జవాబుదారీగా ఉండాలి అన్నారు. తాను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలను మాత్రమే చెబుతాను అన్నారు.

అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో హైదరాబాద్, బెంగళఊరుతో విశాఖ పోటీపడుతుంది అన్నారు ఏపీ సీఎం. జపాన్, సింగపూర్ నగరాలను సృష్టించేంత నిధులు మన దగ్గర లేవని తెలుసన్నారు. అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు 5200 ఎకరాలే ఉంటాయని.. 5200 ఎకరాల అభివృద్ధికి లక్ష కోట్లు ఎక్కడి నుంచి పెట్టాలని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ 1.09 లక్షల కోట్లు కావాలన్నారు ముఖ్యమంత్రి. కీలక మౌలిక సదుపాయాలకు ఎకరాకు రూ.2కోట్లు ఖర్చు అవుతుందని.. ఇంత ఖర్చుతో అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. మూడు రాజధానులు ఖాయమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles