Hyderabad Metro allows boozers to travel on Dec 31st మందుబాబులకు.. గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో రైలు..

Hyderabad metro rail allows even boozers to travel on dec 31st

drunk and drive, accidents, Decembet 31st, cocktail parties, New Year Celebrations, Partygoers, Hyderabad Metro Rail, Hyderabad, Telangana, Politics, Crime

Hyderabad Metro Rail says good news to boozers by announcing that they will allow the alcoholic persons to travel in the train till midnight of 31 December. But, the alcoholic persons should not create any problems for other passengers on the train.

ITEMVIDEOS: మందుబాబులకు.. గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో రైలు..

Posted: 12/30/2019 10:07 PM IST
Hyderabad metro rail allows even boozers to travel on dec 31st

మందుబాబులు.. మరీ ముఖ్యంగా ఎప్పుడు తాగని వారు కూడా ఏడాదికి ఓ పర్యాయం అన్నట్లు న్యూఇయర్ ను స్వాగతిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలా ఎంజాయ్ చేసిన మందుబాబులు డ్రంక్ అండ్ డ్రవ్ చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడం లేదా.. పోలీసులకు అడ్డంగా బుక్కై కటకటాలోకి వెళ్తామన్న భయం పట్టుకుందా.? అయితే ఇలాంటి వారి కోసం ఓ మంచి శుభవార్త నిరీక్షిస్తుంది. ఇక మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా పాత ఏడాదికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సారానికి స్వాగతం పలుకుతూ ఎంజాయ్ చేసేయోచ్చు.

ఓహో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లమంటారా.? అని అంటున్నారా.. కాదండీ.. ఇక సస్సెన్స్ ఎందుకు.. దేశంలోని మిగతా మెట్రో నగరాల్లోని మెట్రో రైలు సేవలు ఆచరించే విధంగా కాకుండా వినూత్నంగా యోచిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ఈ ఏఢాది మందుబాబులకు, పార్టీ రాయుళ్లకు కలిసోచ్చే నిర్ణయం తీసుకుంది. అదేంటంటారా.? మునపటిలా కాకుండా ఈ సారి మాత్రం మందుబాబులకు కూడా తమ రైళ్లు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఇది ముమ్మాటికీ నిజం. ఈ మేరకు మెట్రో యాజమాన్యం తాజాగా ప్రకటనను విడుదల చేసింది.

అటు దేశ రాజధాని ఢిల్లీ నుంచి మన పోరుగునున్న రాష్ట్రం కర్ణాటక వరకు ఏ మెట్రో రైలులో మద్యం సేవించిన ప్రయాణికులకు.. మెట్రో రైళ్లలో ప్రయాణించే వెసలు బాటు కల్పించలేదు. కానీ హైదరాబాద్ మెట్రో మాత్రం ప్రయాణికుల గురించి బాగా తెలుసు కాబట్టి.. డిసెంబర్ 31 మంగళవారం రోజు.. మాత్రం మద్యం బాబులను ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు. అదే రోజున రాత్రి ఒంటి గంట వరకు అన్ని రూట్లలో మెట్రో నగర సేవలు నిర్వహించనున్నారు. అయితే మందుబాబులు మిగతా ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దని అ ప్రకటనలో మెట్రో రైలు యాజమాన్యం కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles