crusial cabinet meet amid amaravati farmers protest అమరావతి గ్రామాలు ఉద్రిక్తం.. క్యాబినెట్ బేటీపై ఉత్కంఠ

Amid amaravati farmers protests crusial cabinet meet takes attention

YS Jagan, Capitals, Amaravati protesters, Amaravati Bandh, !44 Section, Police forces beefedup, mandadam villagers, Tension at Amaravati Farmers protest, Amaravati farmers indefinate fast, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Andhra Pradesh, Politics

The crucial cabinet meeting on three capitals will be held at Amaravati on Friday. There is a possibility of the cabinet giving a nod for recommendations made by GN Rao committee on decentralisation of development.

అమరావతి గ్రామాలు ఉద్రిక్తం.. క్యాబినెట్ బేటీపై ఉత్కంఠ

Posted: 12/27/2019 11:03 AM IST
Amid amaravati farmers protests crusial cabinet meet takes attention

మూడు రాజధానుల ఫీఠముడిపై ఇవాళ మరింత క్లారిటీ రానుంది. రాజధాని అంశంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై క్యాబినెట్ కమిటీ స్పష్టత ఇవ్వనున్న క్రమంలో అమరావతి రైతుల్లో సర్వత్రా అందోళన వ్యక్తం అవుతోంది. వరుసగా పదో రోజు అందోళనలకు దిగిన అమరావతి రైతన్నలలో.. ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననని సర్వాత్రి ఉత్కంఠ నెలకొంది.

గత పది రోజులుగా కొనసాగుతున్న అమరావతి రైతన్నల అంధోళనలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని రైతులు ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. వీరికి పలురాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు, విద్యార్థులు మద్దతు పలుకుతున్నారు. అటు మందడం, ఇటు వెలగపూడి.. సహా రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు అందోళనలు చేపట్టారు. మందడంలో రైతులు రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు వెలగపూడి వద్ద రైతుల రిలేనిరాహార దీక్ష కొనసాగుతోంది.

కాగా, ఇవాళ జరగనున్న క్యాబినెట్ భేటీ నేపథ్యంలో గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. మల్కాపురం, వెలగపూడి ప్రధాన కూడలి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం వైపు వెళ్లే ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మందడంలోని గ్రామస్థులెవరూ బయటకు రాకుండా 144 సెక్షన్‌ విధించారు. మంత్రివర్గ సమావేశం దృష్ట్యా రాజధాని ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 700 మంది పోలీసులను తుళ్లూరు పరిధిలో మోహరించారు. ప్రతి గ్రామంలోనూ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

మంత్రులు, సీఎం వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మందడంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరించినట్లు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. కాగా, అమరావతిని ఎమ్మెల్యేలు, అధికారుల హనీమూన్ స్పాట్ గా మార్చవద్దని.. ఇక్కడే సెక్రటేరియట్, హైకోర్టులను ఏర్పాటు చేయాలని నినదిస్తూ రాజధాని గ్రామాల ప్రజలు అందోళనలు చేపడుతున్నారు. రాజధాని పరిధిలోని గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles