Final Judgement on Hajipur girls murder రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హాజీపూర్‌ బాలికల హత్య కేసులో తుది తీర్పు రానుంది

Final judgement on hajipur girls murder

Hajipur girls murder case, Srinivas Reddy, Hajipur Case, Judgement

The Final Judgement on Hajipur girls murder case in which Srinivas Reddy culprit will be heared.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హాజీపూర్‌ బాలికల హత్య కేసులో తుది తీర్పు రానుంది

Posted: 12/26/2019 06:55 PM IST
Final judgement on hajipur girls murder

స్త్రీలను పూజించే దేశం మనది. అటువంటి దేశంలో స్త్రీలా కై నేటి పోరాటం వారి సంరక్షణకై పాట్లు ఎంతో సిగ్గు చేటు. పుట్టిన ఆడపిల్లను కంటికి రెప్పలా చూసుకున్నె తల్లి తండ్రులకు నేడు తమ బిడ్డ ఒక అరక్షణం బయటకు వెళ్లి ఆలస్యం గా వస్తే ఎంతో ఆందోళన, మరెంతో భీతి, ఎంతో సిగ్గు. ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. నేటి మన యావత్ భారత దేశంలో. గడిచినా పలు ఆడపిల్లల సంఘటనలు  మరింత భయభ్రాంతులను కలుగ చేస్తున్నాయి.

తెలంగాణలో సంచ‌ల‌నం సృష్టించిన కేసులో తుది తీర్పు రానుంది. ఆడపిల్లలా బంగారు జీవితాలను నాశనం చేసినా దుర్మార్గుడికి క‌ఠిన శిక్ష ప‌డ‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హాజీపూర్‌ బాలికల హత్య కేసులో నల్లగొండ అదనపు జిల్లా కోర్టులో ఏర్పాటుచేసిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్‌ వాదనల పిమ్మట బుధవారం జరిగిన విచారణలో పోలీసులు దాదాపు 100 మంది సాక్షులను కోర్టులో హాజరు చేయించి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయించారు. తదుపరి  విచారణకై గురువారం నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని కోర్టుకు తీసుకురానున్నారు. అతని వాంగ్మూలనకై మరియు   తీర్పు కై ఆస‌క్తి మెదలుకుంది.

ఈ సంవత్సరం మే 25వ తేదీన తొమ్మిదో తరగతి విద్యార్థిని కనపడకపోవడం మరియు ఆమె మరణించడం అంతేకాక ఆ కేసు దర్యాప్తులో మారి డిగ్రీ విద్యార్థిని మృతదేహం కూడా బయట పడింది. దాంతో ఈ కేసు పై ఆలోచనలు మరింత పెరిగాయి. ఈ కేసు దర్యాప్తులో హాజీపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డిని అనుమానితుడిగా గుర్తించారు. దొరికినా  సాక్ష్యాల ఆధారంగా శ్రీనివాస్ రెడ్డి తన  బైక్‌పై ఈ యువతిని తీసుకు వెళ్లాడని తేలింది. అంతేకాక ఈ అమ్మాయిపై లైంగికదాడి చేసి అటు పిమ్మట ఆ అమ్మాయిని చంపి బావిలో పడేసినట్టు శ్రీనివాస్ రెడ్డి విచారణలో వెల్లడించారు. ఇటువంటి నర రూప రాక్షసులకు తగిన శిక్ష పడాలి. గురువారం నిందితుడి తరపు వాదనల కోసం శ్రీనివాస్‌రెడ్డిని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మూడు కేసులకు సంబంధించి పోలీసులు మొత్తం 100కుపైగా సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు కూడా శాస్త్రీయ, సాంకేతికపరమైన ఆధారాలను చాల జాగ్రత్తగా ప్రవేశ పెట్టారు. దీంతో నిందితుడికి శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుందని ఆ ప్రాంతా ప్రజలు మరియు పోలీసులు భావిస్తున్నారు. ఇలా దారుణంగా అమాయక బాలికలా పై అత్యాచారాలు మరియు వారిని బతికి ఉండగానే తీవ్ర క్షోభకు గురి చేసి చంపేయడం ఎంత వరకు  సబబు. ఇటు వంటి వారికి సరి అయినా శిక్షలు విధించాలి అపుడే ఆ బాలికల ఆత్మ సంతృప్తి చెందుతుంది.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hajipur murder case  Srinivas Reddy  

Other Articles