IBPS SO recruitment 2020 notification డిగ్రీ అర్హతతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు

Ibps so recruitment 2020 notification released at ibps in

ibps so 2019 notification, IBPS SO 2019 recruitment 2019, ibps so notification 2019, IBPS Specialist Officer 2019, Institute of Banking Personnel Selection, ibps, ibps so recruitment, ibps so notification 2020, ibps so 2020 notification, ibps.in

Institute of Banking Personnel Selection (IBPS) released the notification for recruitment of Specialist Officers posts today on its official website. Interested candidates who wish to check the detailed advertisement can visit the official website at ibps.in.

డిగ్రీ అర్హతతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు

Posted: 11/06/2019 12:34 PM IST
Ibps so recruitment 2020 notification released at ibps in

భ్యాంకింగ్ సెక్టార్ లో వైట్ కాలర్ ఉద్యోగాలు చేయాలంటే చాలా మంది సుముఖత వ్యక్తం చేస్తారు. అందుకు కారణంగా వారికి అధికంగా పని ఒత్తడి వుండదని బావన. ఈ విషయాన్ని పక్కనబెడితే బ్యాంకు ఉద్యోగం కొట్టి ఫ్యాను కింద కూర్చోనే ఉద్యోగం చేయాలని యువత భావించడంలో తప్పులేదు. ఇక నగరాల్లోని బ్యాంకులన్నీ రమారమి ఎయిర్ కండీషన్ తోనే ఏర్పాటు కావడంతో వాటిల్లో ఉద్యోగాల కోసం పోటీ పడే యువత కూడా అధికంగానే వుంటారు. ఇలాంటి యువత ఆశలను నెరవేర్చుందుకు బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక అధికారుల ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

* స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నవంబర్ 6 నుంచి ఆన్ లైన్ లో  ధరఖాస్తులను స్వీకరించనుంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS.
* ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ లాంటి మొత్తం 1163 ఖాళీలను ప్రకటించిన ఐబిపీఎస్ పోస్టులకు ధరఖాస్తులను ఆహ్వానించింది.
* ఐబిపిఎస్ ప్రత్యేక అధికారులు ఉద్యోగాల భర్తీకి ఇవాళ్టి నుంచి నవంబర్ 26 వరకు స్వీకరిస్తారు. చివరి తేదీ: నవంబర్ 26 సాయంత్రం 5గంటలు.
* సంబంధిత పోస్టుకు సంబంధించిన డిగ్రీలో ఉత్తీర్ణులైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
* ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఐబిపిఎస్ ఎంపిక చేయనుంది.
* ఐబీపీఎస్ 76 మంది ఐటీ అధికారులను, 670 మంది అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆధికారులను, 27 మంది రాజ్‌భాష అధికారులను, 60 మంది న్యాయ (లా) అధికారులను, 20 మంది హెచ్ఆర్ పర్సనల్ ఆధికారులను, 310 మంది మార్కెటింగ్ అధికారులను భర్తీ చేయనుంది.  
* ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్లో ముఖ్యమైన తేదీలను చూస్తే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ 2019 నవంబర్ 6 నుంచి 2019 నవంబర్ 26 వరకు కొనసాగుతుంది.  
* ఐబీపీఎస్ ఎస్ఓ పోస్టులకు అప్లికేషన్ ఫీజు 2019 నవంబర్ 6 నుంచి 2019 నవంబర్ 26 వరకు చెల్లించొచ్చు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100, ఇతర అభ్యర్థులకు రూ.600 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
* ఐబీపీఎస్ ఎస్ఓ పోస్టులకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ 2019 డిసెంబర్ 28, 29 తేదీల్లో జరుగుతుంది. ఫలితాలు 2020 జనవరిలో విడుదలౌతాయి.  
* మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ 2020 జనవరి 25న జరుగుతుంది. 2020 ఫిబ్రవరిలో మెయిన్స్ ఫలితాలు విడుదలౌతాయి.
* ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్‌ను 2020 ఫిబ్రవరిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే నెలలో ఇంటర్వ్యూలు ఉంటాయి. 2020 ఏప్రిల్‌లో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఉంటుంది.  
* ఎంపికైనవారికి అలాహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టింగ్ లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ibps  ibps so recruitment  ibps so notification 2020  ibps so 2020 notification  ibps.in  

Other Articles