two die during rains in hyderabad హైదరాబాద్ లో ఇద్దరిని బలిగొన్న వరుణుడు

Heavy rains continue to pound hyderabad normal life hit

gym instructor, electrocute, priest, nala, Indian Meteorological Department (IMD). Hyderabad rains, traffic woes, hyderabadis standstill, heavy rains, Torrential rains, Seri Lingampally, chaitanyapuri

A 23-year-old gym instructor was electrocuted to death in Serilingampally, while a 43-year-old priest fell into a nala in Chaitanyapuri.

కార్పోరేటర్ నిరసన.. ఇద్దరిని బలిగొన్న వరుణుడు

Posted: 09/26/2019 11:01 AM IST
Heavy rains continue to pound hyderabad normal life hit

అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతూ అంతకంతకూ అదరణ పోందుతున్న హైదరాబాద్ మహానగరంలోని జనజీవనాన్ని గత పక్షం రోజులకు పైగా కురుస్తున్న వర్షాలు స్థంబింపజేశాయి. మొదట్లో కేవలం రాత్రిళ్లు మాత్రమే కురిసిన వర్షం., రానురాను సాయంకాలం కాగానే నగరవాసుల్ని తడిపి ముద్దచేస్తోంది. ఇక గత వారం రోజులుగా నిత్యం మేఘాలు అలుముకున్న నగరంలో అప్పుడప్పుడు ఎడతెరపినిస్తూవరుణుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని లొత్తట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. వాన పేరెత్తితేనే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లు చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నారు. హయత్ నగర్ డివిజన్ లోని సుష్మా సాయినగర్ ‘గ్రీన్ మిడోస్ కాలనీ’లోకి వెళ్లే దారి కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ఇళ్లకు వెళ్లే దారిలేక కాలనీ వాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

దీంతో వారు ఆ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వర్షపు నీటిలో పడుకుని నిరసన తెలిపారు. కాగా, తిరుమల్ రెడ్డి గతంలోనూ ఇలానే వినూత్నంగా నిరసన తెలిపి వార్తల్లోకి ఎక్కారు. రోడ్లపై చెత్తను శుభ్రం చేస్తూ, నాలాల్లో చెత్తను తొలగిస్తున్న ఆయన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

తదేకంగా ప్రతీ రోజు కురుస్తున్న వర్షాల కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటనలు నగరంలో చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరని వరుణుడు బలితీసుకున్నాడు. శేరిలింగంపల్లిలో ఓ ఫిట్ నెస్ ట్రైయినర్ విద్యుద్ఘాతంతో మరణించగా, చైతన్యపురిలో ఓ అర్చకుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృత్యువాత పడ్డాడు. శేరిలింగంపల్లిలోని మణికంఠ మెన్స్ హాస్టల్ లో వుంటున్న అడమ్ మార్క్ జోర్డన్ అనే 23 ఏళ్ల ఫిట్ నెస్ ట్రైయినర్ రాత్రి 11.30 నిమిషాలకు జిమ్ నుంచి హాస్టల్ కు వెళ్తన్నాడు.

అడమ్ ఒక ఉక్కు రాడ్డు వుండటంతో దానిపై కాలు పెట్టి నీటి నుంచి దాటేందుకు ప్రయత్నించాడు. ఆ రాడ్డు నేరుగా విద్యుత్ పాస్ కావిద్యుద్ఘాతంతో మరణించాడు. ఈ ఘటన సరిగ్గా ఆయన హాస్టల్ గేటుకు ముందరే జరిగినా.. వర్షం వల్ల ఎవ్వరూ చూడకపోవడంతో కాపాడలేకపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని పోలీసులు తెలిపారు. ఇక మరో ఘటనలో చైతన్యపురిలో ప్రేమ్ కుమార్ శాస్త్రీ అనే 43ఏళ్ల అర్చకుడు నాలా పడి గల్లంతయ్యాడు.

రామకృష్ణ శర్మ అనే మరో బ్రాహ్మణుడితో కలసి పనిపై వెళ్లాడు ప్రేమ్ కుమార్. పెద్దఅంబర్ పేట్ వద్ద తమ బైక్ ను నిలిపిన పని ముగించుకున్నారు. ఈ క్రమంలో రాత్రి 11.40 నిమిషాలకు వారు చైతన్యపురికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో అనుకోకుండా ప్రమదానికి గురయ్యారు. దీంతో ఇద్దరు అదుపుతప్పి నాలాలో పడిపోయారు. అయితే రామకృష్ణ నాలా నుంచి తప్పించుకున్నా.. ప్రేమ్ కుమార్ మాత్రం నీళ్లలో గల్లంతయ్యాడు. సుమారు వంద మీటర్ల దూరంలో అతని మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gym instructor  electrocute  priest  nala  Hyderabad rains  traffic woes  Torrential rains  

Other Articles